Saturday, May 11, 2024

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Chandrababu Convoy Accident At Bhuvanagiri

హైదరాబాద్: టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చంద్రబాబు కాన్వాయ్ కు ఆవు అడ్డురావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో కాన్వాయ్ లోని రెండు, మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కారపురం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చంద్రబాబుతో పాటు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా, ప్రతి శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు అందుబాటులో ఉంటారన్న సంగతి తెలిసిందే.

 

Chandrababu Convoy Accident At Bhuvanagiri
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News