Wednesday, May 1, 2024

రాజకీయాల్లో చంద్రబాబు విలన్: గుడివాడ

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేసున్నారో తెలియడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. మొన్నటి వరకు పార్ట్-1 ఇప్పుడు పార్ట్-2 అంట రాజకీయం అంటే ఒటిటి వెబ్ సిరీస్ కాదన్నారు. పవన్ సినిమాల్లో హీరో అని, రాజకీయాల్లో మాత్రం సైడ్ యాక్టర్ అని విమర్శించారు. పవన్ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలన్ అని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో తమకు అభ్యర్థులే లేరన్నారు. చంద్రబాబు భుజాన వేసుకొని తిరగడానికి రాజకీయ పార్టీ దేనికని ప్రశ్నించారు. ఎపి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు విలన్ అని అమర్నాథ్ దుయ్యబట్టారు. నేషనల్ మీడియాలో పవన్ భార్యతో విడిపోయారని వార్త వస్తే వెంటనే భుజాలు తడుముకొని ఒక ఫొటో విడుదల చేశారన్నారని అమర్నాథ్ ధ్వజమెత్తారు.

also read: బ్లాక్ బస్టర్ కాంబో ఈజ్ బ్యాక్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News