Tuesday, May 21, 2024

ఛాంగురే ఐటమ్ సాంగురే…

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సందీప్‌కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గల్ల్లీరౌడీ’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో.. ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహ కీలకపాత్రలలో నటిస్తుండగా సందీప్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఛాంగురే ఐటమ్ సాంగురే..’ అనే ఐటమ్ సాంగ్ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫుల్ సాంగ్‌ను గురువారం సాయంత్రం 4 గంటలకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. మంచి మాస్ బీట్‌తో సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సాయికార్తిక్ సంగీతాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తిక్, దత్తు కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిందించిన ఈ సాంగ్ ప్రోమో జోరుగా వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=c-Dkg_o9p_g

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News