Wednesday, May 15, 2024

మాస్ సాంగ్‌తో బిగ్ మూవీ ప్రారంభానికి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఓ బిగ్ మూవీ రూపొందబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ పాన్ ఇండియా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా దర్శకుడు శంకర్ హైదరాబాద్‌లోనే ఉంటూ షూటింగ్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. నటీ నటుల ఎంపిక మొదలుకొని లొకేషన్స్ అన్వేషణ, సెట్టింగ్స్ నిర్మాణం వరకు అన్ని విషయాలను ఆయన పరిశీలిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో నటించేందుకు చరణ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడి తర్వాత వెంటనే అదే స్థాయి దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఎప్పుడెప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలవుతుందో అంటూ చరణ్‌తో పాటు మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చరణ్‌పై సాంగ్ చిత్రీకరణతో షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. శంకర్ సినిమాలోని పాటలకు కోట్లల్లో ఖర్చు చేస్తూ ఉంటారు. అలాగే చరణ్ మూవీ కోసం కూడా అలాంటి ఒక సెట్టింగ్‌ను వేయించారట. ఆ సెట్టింగ్‌లో చరణ్‌పై పాటను చిత్రీకరించబోతున్నారు. పాటలో చరణ్‌తో పాటు హీరోయిన్ కూడా పాల్గొంటుందా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో ఏ క్షణంలో అయినా చరణ్‌పై సాంగ్‌తో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంటున్నారు. భారీ ఎత్తున డ్యాన్సర్స్‌తో పాటు హై టెక్నికల్ టీమ్‌తో పాట చిత్రీకరణ చేయబోతున్నట్లుగా తెలిసింది. మొదటి పాటకు గాను జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించబోతున్నాడు. తమన్ నుండి అద్భుతమైన ఒక మాస్ బీట్ సాంగ్‌ను ఇప్పటికే శంకర్ తీసుకున్నాడు. దానికి తన మార్క్ కు తగ్గట్లుగా మార్పులు చేయించుకొని రెడీ చేయించాడట.

Charan-Shankar film shoot stars with mass song

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News