Friday, May 10, 2024

ఫిబ్రవరిలో ప్రముఖ పండితులతో చతుర్వేద సభ

- Advertisement -
- Advertisement -

టిటిడి జెఈవో సదా భార్గవి

మన తెలంగాణ / హైదరాబాద్ : లోక కళ్యాణార్థం తిరుపతిలో 2024 ఫిబ్రవరి నెలలో దేశంలోని ప్రముఖ పండితులతో చతుర్వేద సభ ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం జెఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో నిర్వహించే చతుర్వేద సభకు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1300 మంది ప్రముఖ వేద పండితులు, అహితాగ్నులు, స్కీం పారాయణదారులను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, గార్డెన్, ఆరోగ్య, వసతి, రవాణా తదితర విభాగాలు ఏర్పాట్లపై ఇప్పటి నుండి తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సిఏఓ శ్రీశేషశైలేంద్ర, అదనపు ఎఫ్ ఏసిఏఓ రవి ప్రసాదు, డిపిపి కార్యదర్శి సోమయాజులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News