Saturday, April 27, 2024

చెన్నై డాక్టర్లకు అమెరికన్ ఆఫ్తాల్మాలజీ అకాడమీ అవార్డు

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెన్నైలోని డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులకు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్తాల్మాలజికి చెందిన సెక్రటేరియట్ అవార్డు-2021 లభించింది. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి గ్రూపునకు చెందిన చీఫ్ క్లినికల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్, డాక్టర్ అగర్వాల్ రిఫ్రాక్టివ్ అండ్ కార్నియా ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ చీఫ్ డాక్టర్ సూసన్ జాకబ్‌లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అమెరికన్ అకాడమి ఆఫ్ ఆఫ్తాల్మాలజీ ప్రపంచంలో కంటి డాక్టర్లు, సర్జన్లకు చెందిన అతి పెద్ద సంఘమని, ఆఫ్తాల్మాలజీ, ఆఫ్తాల్మిక్ విద్యలో అందచేసిన సేవలకు గాను ఈ వైద్యులిద్దరినీ ఈ అవార్డుకు ఎంపికయ్యారని ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి చైర్మన్ ప్రొఫెసర్ అమర్ అగర్వాల్ అవార్డుకు ఎంపికైన ఇద్దరు డాక్టర్లను అభినందించారు.

Chennai Doctors get American Academy of Ophthalmology Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News