Friday, May 10, 2024

రాయచోటిలో డా అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రాయచోటి: భారతదేశములోని అతిపెద్ద కంటి సంరక్షణా కేంద్రాలలో ఒకటైన డా అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్  రాయచోటిలో తన ప్రాథమిక కంటి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.ముఖ్య అతిథి జి.శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం. డా అగర్వాల్స్ ఐ క్లినిక్ ను ప్రారంభించారు.

డా అగర్వాల్స్ ఐ క్లినిక్ ఒక ఆధునిక కంటి సంరక్షణ సదుపాయము. ఇందులో నిపుణులైన వైద్యులు సంపూర్ణ కంటి ఆరోగ్య చెక్-అప్స్ అందిస్తారు. ఈ కేంద్రములో రిఫ్రాక్షన్ డిగ్రీ, కంటి ఒత్తిడి, విజువల్ తీక్షణతలను ఖచ్ఛితంగా అంచనావేయుటకు, కంటి శుక్లాలను ప్రారంభదశలోనే కనుగొనుటకు అత్యాధునిక ఉపకరణాలు ఉన్నాయి. ఎవరైనా ఈ కంటి ఆసుపత్రికి వచ్చి ఉచిత సంపూర్ణ కంటి చెక్-అప్, నిపుణులైన వైద్యుల నుండి ఉచిత కన్సల్టేషన్ ను అందుకోవచ్చు.

ఈ ప్రారంభాన్ని సూచిస్తూ, డా అగర్వాల్స్ ఐ క్లినిక్, రాయచోటి “ఏదైనా లెన్స్ కొనండి ఒక ఫ్రేమ్ ఉచితంగా పొందండి” అనే ప్రారంభ ఆఫర్ తోపాటు ఉచిత శుక్లాల చెక్-అప్స్ కూడా అందిస్తోంది.

డా. సుమంత్ రెడ్డి ఎంఎస్, ఎఫ్‎ఎంఆర్‎ఎఫ్, ఎఫ్‎విఆర్‎ఆర్‎ఎఫ్ రీజనల్ హెడ్-క్లినికల్ సర్వీసెస్, డా అగర్వాల్స్ ఐ హస్పిటల్స్, తిరుపతి ఇలా అన్నారు.. “దేశవ్యాప్తంగా సంపూర్ణ కంటి-సంరక్షణ అందుబాటులోకి తేవాలనే మా అంకితభావానికి ఫలితమే డా అగర్వాల్స్ ఐ క్లినిక్. ఇది సుశిక్షితులైన ఆప్టోమెట్రిస్ట్స్, స్థానిక జనాభా యొక్క కంటి సంరక్షణ అవసరాలకు సహకారాన్ని అందించుటకు రెగ్యులర్ గా కేంద్రాన్ని సందర్శించే నిపుణులైన వైద్యుల సమ్మేళనాన్ని అందిస్తుంది.”

ఇంకా ఈ సందర్భంగా హాజరైన డాక్టర్ గోపి కృష్ణ పి, MBBS, DO, M.Phil, డా అగర్వాల్స్ ఐ హస్పిటల్స్, తిరుపతి, ఇలా అన్నారు.. “క్లినిక్ లో వివిధ కంటి పరిస్థితులను నిర్ధారించుటకు, చికిత్స అందించుటకు స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఉపకరణాలు ఉన్నాయి. ఇక్కడి పరిసర ప్రాంతాలలో కూడా నాణ్యమైన కంటి సంరక్షణ లభ్యతను మెరుగుపరచడము కూడా దీని లక్ష్యాలలో ఒకటి. గ్రామీణ జనాభాకు ప్రాథమిక కంటి సంరక్షణ అందుబాటులోకి తేవడము, గ్రామీణ, సెమీ-అర్బన్ జనాభాలో కంటి సంరక్షణ సేవలను అందుకోవడాన్ని పెంచడములో సహాయం చేయడము డా అగర్వాల్స్ ఐ క్లినిక్ లక్ష్యము”.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జి.శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం, మాట్లాడుతూ.. “రాయచోటిలో డా అగర్వాల్స్ ఐ క్లినిక్ ను ప్రారంభించడం నాకెంతో సంతోషంగా ఉంది. జాగ్రత్తలు తీసుకొని కంటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అన్ని వయసులలో మంచి కంటి చూపును నిలిపి ఉంచటానికి రెగ్యులర్ గా కంటి చెక్-అప్స్ చేయించుకోవడం ముఖ్యం. డా అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ నుండి కంటి క్లినిక్ బృందము గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు నాణ్యమైన కంటి సంరక్షణ ప్రయోజనాన్ని అందించుటకు చిన్న పట్టణాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నందుకు నేను ధన్యవాదములు తెలుపుతున్నాను అని అన్నారు”.

చిత్తూరు రోడ్డులో, సబ్ స్టేషన్ పక్కన, జామ్ జామ్ రెసిడెన్సీ ఎదురుగా ఉంది, ఈ కొత్త ఐ క్లినిక్ సమగ్రమైన శుక్లాల & రెగ్యులర్ కంటి చెక్-అప్ ను, నిపుణులైన వైద్యులతో వ్యక్తిగత సంప్రదింపును. విస్తృత శ్రేణి బ్రాండెడ్ ఆప్టికల్ & సన్ గ్లాసెస్ ఎంపికలను అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News