Thursday, May 2, 2024

కరోనా వ్యాక్సిన్‌కు చైనా అనుమతి..

- Advertisement -
- Advertisement -

China Govt permission to corona vaccine released

బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని ప్రయోగాల్లో విజయవంతమై, విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగన్ తయారు చేసిన కాన్సినో బయో వ్యాక్సిన్ లిమిటెడ్‌కు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆ దేశానికే చెందిన వూహౠన్, సినోవాక్ వ్యాక్సిన్లు ఇప్పటికే మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ఇప్పటికే మూడు ఫేజ్‌లను పూర్తిచేసుకుని బహిరంగ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది.

దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఇక ఆస్ట్రేలియా సైతం కరోనా విరుగుడు తయారీలో దూసుకుపోతోంది. ఆ దేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మార్డోక్ వ్యాక్సిన్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బహిరంగ మార్కెట్‌లో విడుదల చేయడానికి ఆ దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రయోగాల్లో సత్ఫలిస్తోందని ఐసిఎంఆర్ ఇదివరకే ప్రకటించింది. అయితే మన దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

China Govt permission to corona vaccine released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News