Sunday, April 28, 2024

ఈ రైలు యమా ఫాస్ట్ గురూ

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనా దేశం కొత్త కొత్త అవిష్కరణలు, టెక్నాలజీ విషయంలో ముందు వరసలో ఉంటుంది. సరికొత్త పరిశోధనలు చేస్తూ అతివేగంగా దూసుకపోతుంది. గంటకు 623 కిలో మీటర్ల పైగా వేగంతో ప్రయాణించే మోగ్లెవ్ రైలును ప్రారంభించింది. తన రికార్డును తానే బద్ధులు కొట్టుకుంటూ చైనా ముందుకు వెళ్తోంది. రెండు సంవత్సరాల క్రితం చైనా అత్యంత వేగంగా ప్రయాణించే రైలును ప్రారంభించడంతో రికార్డు సృష్టించింది. అయస్కాంత లెవిటేటెడ్ తో రెండు కిలో మీటర్ల పొడవు ఉన్న మోగ్లెవ్ రైలును తయారు చేశామని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ ఇండస్ట్రీ కార్పొరేషన్ తెలిపింది. తక్కువ పీడనం కలిగి ఉండడంతో మునుపటి కంటే గంటకు 623 కిలో మీటర్ల వేగానికి పైగా ప్రయాణిస్తుందని తెలిపింది. అల్ట్రా ఫాస్ట్ హైపర్ లూప్ రైలు తక్కువ పీడనం కలిగిన ట్యూబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు స్థిరమైన వేగం అందుకోడం ఇదే మొదటి సారి అనే వివరించింది. అత్యంత వేగంగా ప్రయాణించడానికి గాలి నిరోధకతను తగ్గించే తక్కువ వాక్యూమ్ ట్యూబ్ సహకరిస్తుందని తెలియజేసింది. గంటకు 1000 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే రైలు రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సిఎఎస్‌ఐసి స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News