Tuesday, April 30, 2024

కరోనాపై చైనా విజయం: ఉత్తర కొరియా అధినేత కిమ్

- Advertisement -
- Advertisement -

kim jong un

 

ఉత్తర కొరియా: కరోనా వైరస్‌ ను కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. కరోనాను నియంత్రించిన తీరు చాలు బాగుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కిమ్ కొనియాడారు. జిన్‌పింగ్ ఆరోగ్యంగా ఉండాలన్నారు. 20 రోజుల తరువాత బాహ్య ప్రపంచంలోకి వచ్చిన కిమ్… చైనాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ అధికారిక కెసిఎన్‌ఎ మీడియా సంస్థ ద్వారా సందేశాన్ని పంపించారు. చైనాకు వ్యాపార భాగస్వామిగా ఉన్న ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్ పాజిటీవ్ లేకపోవడంతో ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా వైరస్ చైనాలో పుట్టి అగ్ర రాజ్యాలను గడగడ వణికిస్తోన్న విషయం తెలిసిందే. అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. న్యూయార్క్‌లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకపోయాయి. ఒక్య న్యూయార్క్ లోనే 3.4 లక్షల కరోనా వ్యాధి బారిన పడగా 26 వేల మంది చనిపోయారు.

అమెరికాలో కరోనా వైరస్ 12,92,850 మందికి వ్యాపించగా దాదాపుగా 77 వేల మంది బలయ్యారు. ప్రపంచంలో కరోనా బాధితులు సంఖ్య 39 లక్షలకు చేరుకోగా 2.7 లక్షల మంది చనిపోయారు. చైనాలో 82,886 మందికి కరోనా వైరస్ సోకగా 4633 మంది మరణించారు. ప్రస్తుతం చైనాలో ఆస్పత్రిలో 260 చికిత్స పొందుతుండగా 78 వేల మంది ఈ వైరస్ నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిపోయారు. భారత్‌లో కరోనా రోగుల సంఖ్య 56 వేలకు చేరుకోగా 1890 మంది మృత్యువాతపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News