Friday, April 26, 2024

కరోనా వైరస్ విలన్ చైనానే

- Advertisement -
- Advertisement -

Chinese government knew about coronavirus

హాంకాంగ్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చైనాకు ఓ షాక్ తగిలింది. ఈ భయంకరమైన వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసిందని ప్రముఖ వైరాలజిస్టు లి మెంగ్ యాన్ తెలిపారు. ఫ్యాక్స్ న్యూస్‌కు ఈ మహిళ ఇంటర్వూ ఇచ్చారు. హాంకాంగ్ నుంచి అమెరికాకు పారిపోయిన ఈ మహిళ వైరస్‌పై చైనా దాగుడుమూతల వైఖరిని ప్రదర్శించిందని చెప్పారు. వైరస్ గు రించి తమకు ముందుగా తెలియదని, తెలిసిన వెంటనే నివారణ చర్యలకు దిగామని, తరువాత దీని గురించి ఐక్యరాజ్యసమితికి కూడా తెలియచేశామని చైనా చెపు తూ వచ్చింది. అయితే ఈ వాదన నిజం కాదని లి మెంగ్ యాన్ స్పష్టం చేశారు. వైరస్ పుట్టుపూర్వోత్తరాలు, లక్షణాలు. అంటువ్యాధుల శాస్త్రంలో ఈ మహిళా సైంటిస్టు స్పెషలిస్టుగా ఉన్నారు. హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థలో చదివారు.

తమ దేశంలో పుట్టిన వైరస్ గురించి తొలిదశలోనే చెప్పాల్సిన బాధ్యత చైనా ఆరోగ్య శాఖదేనని, ఇది అంతర్జాతీయ నైతిక బాధ్యత అని, ప్రత్యేకించి అంటువ్యాధుల వ్యాప్తి, వైరస్ విజృంభణల వంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే చైనా బాధ్యత ఇదేనని ఆమె స్పష్టం చేశారు. ఇంతకు ముందటి ఇన్‌ఫ్లూయెంజా ఇతర అంటువ్యాధుల తీవ్రత వాటి వ్యాప్తి స్వరూపస్వభావాల నేపథ్యంలో చైనా తన బాధ్యతను విస్మరించిందని నిందించారు. ఈ ఏడాది ఆరంభంలో వైరస్ వ్యాప్తి చెందుతూ పోయిందని, దీనిపై ముందుగానే తెలిసినా చైనా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వైరస్ లక్షణాలకు సంబంధించిన రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులు కూడా పరిశోధనల పట్ల శ్రద్ధ వహించలేదని, పైగా ఈ వైరస్‌పై తాను చేపట్టిన రిసర్చ్‌ను కూడా గేలిచేశారని ఆరోపించారు. వైరస్ తొలినాళ్లలోనే దీని గురించి సరైన రీతిలో పరిశోధనలు జరిగినా, ప్రజలలో సరైన అవగావహన పెంచినా ఇది ఇప్పు డు విశ్వవ్యాప్తంగా ఇంతటి ప్రభావాన్ని చూపి ఉండకపోయేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అన్ని దేశాలకు ఈ వైరస్ పాకిందని,దీని మూలాలు ఉన్న దేశం ముందుగా దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కోవిడ్ రిసర్చ్‌లో నెంబర్ 1

ప్రపంచంలో తానే కోవిడ్ 19పై అధ్యయనానికి దిగిన తొలి వ్యక్తిని అని తెలిపారు. అయితే చైనాలో దీనికి సంబంధించిన పరిశోధనలకు తాము తెలియచేసినా చైనా పట్టించుకోలేదని, ఇతర దేశాల నిపుణులను చివరికి హాంగ్‌కాంగ్ వారిని కూడా దీనికి సమ్మతించేది లేద ని చెప్పారని, ఇదంతా కూడా వారి లోగుట్టు ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో ఆడిన నాటకం అని మండిపడ్డారు. తాను చైనాలోని సహచరులతో ఈ విచిత్ర వైరస్ గురించి చర్చించానని, వారు తొలుత కొంత సమాచారం ఇచ్చారని, అయితే తరువాతి దశలో వారి వైఖరిలో మా ర్పు వచ్చిందని తెలిపారు. రోగులకు చికిత్స చేసిన వైద్యు లు అయినా కొంత సమాచారం ముందు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇప్పటిలాగా ఉండేది కాదని తేల్చిచెప్పారు.

చైనాలోని వూహాన్ వైరస్‌కు జన్మస్థలం అని తెలిసిందే. అయితే తొలిసారిగా తమ వద్దకు వచ్చిన వైరస్ గ్రస్థ రోగులకు చికిత్స జరిపిన వైద్యులు కూడా తరువాతి దశలలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, ఇదంతా కూ డా వారిపై నిఘా పెరగడం , వారు అధికారికంగా పలు ఒత్తిళ్లకు గురి కావడం వల్లనే జరిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి చెప్పలేమని పేర్కొ న్న డాక్టర్లు మాస్క్‌లువేసుకుని ప్రజలు తిరిగితే బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పారని యాన్ తెలిపారు.

మనుష్యుల నుంచి మనుష్యులకే ఎక్కువ

మనుష్యుల నుంచి మనుష్యుల ద్వారానే వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని, తొలుత జంతువుల నుంచి ఇది మనుష్యులకు సోకిందని తాము నిర్థారణకు వచ్చినట్లు తెలిపారు. హాంకాంగ్‌లో తన పరిశోధనలకు ఎటువంటి ప్రోత్సాహం అందకపోవడం పైగా ఆంక్షల వరకూ పరిస్థితి తలెత్తడంతో ఆమె మూటాముల్లే సర్దుకుని , నిఘా నీడలను తప్పించుకుని, సిసి కెమెరాల కళ్లు గప్పి ఎప్రిల్ 28వ తేదీన పసిఫిక్ విమానం ద్వారా అమెరికాకు చేరారు. అప్పుడు ఆమె వద్ద పాస్‌పోర్టు, కొంత డబ్బు ఉంది. హాంగ్‌కాంగ్‌లో తన ఇష్టులైన వారిని అందరినీ వదిలిపెట్టి, చెప్పాపెట్టకుండా రావాల్సి వచ్చిందని ఏకరువు పెట్టారు.

తాను అరెస్టు అయి ఉంటే, వైరస్ గురించి తన వద్ద సమాచారం ఉందని తెలిసి ఉంటే తనను చైనా అధికారులు వదిలిపెట్టి ఉండేవారు కాదని, జైలులో తోసేసే వారని చెప్పారు. ఇంతటితో సరిపెట్టి ఉండేవారు కాదని, తనను గల్లంతు చేసి ఉండేవారని అన్నారు. ప్రస్తుతం యాన్ అమెరికాలో తలదాచుకుంటున్నారు. తాను పుట్టిన దేశంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు తన పరువు ప్రతిష్టలను మంటగలిపేందుకు యత్నిస్తోందని, అక్కడి అధికారిక తొత్తులు తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, సైబర్ దాడికి పాల్పడినట్లు చిత్రీకరిస్తున్నారని, ఈ విధంగా తనను బెదిరించి కిమ్మనకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

పలు వేధింపులు ..పోరు ఆగదు

హాంగ్‌కాంగ్‌లోని తన స్వస్థలం క్వింగ్‌డావోలోని తమ చిన్న నివాసంలోకి అధికారులు చొరబడి, తన తల్లిదండ్రులను విచారించారని తెలిపారు. తాను వారితో మాట్లాడితే వారు ఏడుస్తూ విషయం చెప్పారని, వెంటనే దేశానికి రావాలని కోరారని వెల్లడించారు. వైరస్‌పై పోరు వద్దు గీరు వద్దు బుద్ధిగా వచ్చి ఉండాలని వేడుకున్నారని తెలిపారు. ‘ఇప్పటికి నా ప్రాణాలకు ముప్పు ఉంది. స్వస్థలం ఇప్పట్లో వెళ్లలేను. తిరిగి ఎప్పటికి తన స్నేహితులను ఆత్మీయులను కలుస్తానో తెలియదు. అన్నింటికంటే మించి కుటుంబంతో ఎప్పుడు సరదాగా ఉంటానో తెలియదు.

అయితే ముప్పు పొంచి ఉన్నా ఇందులోనే విలువ ఉందని అనుకుంటున్నా. ఏదో సాధించాలనుకుంటే ఎంతైనా పోగొట్టుకోవల్సిందేగా’ అని తెలిపారు. కోవిడ్‌పై అసలు నిజాలను ప్రపంచానికి తెలియచేసేందుకే తాను అమెరికాకు వచ్చినట్లు స్పష్టం చేశారు. అమెరికాలోని ఓ అజ్ఞాత ప్రదేశం నుంచి ఆమె వార్తా సంస్థకు ఇంటర్వూ ఇచ్చారు. వైరస్ గురించి చైనాలో చెప్పి ఉంటే తాను అదృశ్యం అయిపోవడమో లేదా అంతం అయిపోవడో జరిగి ఉండేదని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News