Tuesday, April 30, 2024

మరో సినిమాకు చిరు గ్రీన్ సిగ్నల్..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్న చిరు.. దీన్ని తర్వాత లూసీఫర్ రీమేక్ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్స్ బాబీ, మెహర్ రమేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమాలకు కమిట్ అయ్యాడు. అయితే, తాజాగా మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తోనూ ఓ మూవీని చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు పండుగే చిత్రంతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ మారుతి ఇటీవల చిరుని కలిసి మాస్ ఎంటర్టైనర్ స్టోరీ చెప్పాడట. అది చిరుకు బాగా నచ్చడంతో మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ సినిమాను గీతా అర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మారుతి, గోపిచంద్ కాథానాయకుడిగా పక్కా కమర్షియల్ మూవీని తీస్తున్నాడు. మరోవైపు చిరు లిస్ట్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. మరి వీరి కాంబినేషన్ మూవీ ఎప్పడు పట్టాలెక్కుతుందో చాడాలి.

Chiranjeevi and Maruti to team up for New Movie?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News