Tuesday, April 30, 2024

సందీష్ భాటియాతో చిట్ చాట్ అదిరింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యూట్యూబ్‌లో పొలిటికల్ ఇంటర్వ్యూలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు సందీష్ భాటియా. అన్‌ఫిల్టర్‌డ్ బై సందీష్ అంటూ చేసే ఇతని ఇంటర్వ్యూల్కు ఆన్‌లైన్‌లోనే కాదు బయట కూడా కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులని సందీష్ ఇంటర్వూ చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలను స్టోరీగా తీసుకుని సందీష్ చేసే ఇంటర్వ్యూలు ఇప్పుడున్న యువతకు బాగా నచ్చుతాయి. అయితే ఇదంత మీకు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా.! విషయం ఉందండి.

సందీష్ భాటియా తాజాగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌తో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ ప్రోమోలో ఇండియాలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఎలా ఎదిగింది. ప్రస్తుత తెలంగాణ రాజకీ యాలు, మతం గురించి కెటిఆర్ ఆలోచన, కెటిఆర్ ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నాడు. అనే టాపిక్‌లు ఈ ఇంటర్వూలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మామూలుగానే సందీష్ వీడియోలు హ్యూమర్‌తో నిండి ఉంటాయి. ఇక సందీష్‌కి కెటిఆర్‌లాంటి గ్రేట్ లీడర్ తోడవడంతో ఇంటర్వ్యూ ఎలా ఉంటుందని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News