Tuesday, May 7, 2024

చాహల్‌కు గేల్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

chris gayle, yuzvendra chahal

బార్బడోస్: భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు చాహల్‌ను తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన చాలా మంది టీమిండియా క్రికెటర్లు ఒకరితో ఒకరూ సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్నారు. కాగా, క్రికెటర్లు చేస్తున్న లైవ్ చాట్‌ల మధ్యలో చాహల్ దూరుతూ వారికి అసౌకర్యం కలిగిస్తున్నాడు. తమ చాట్‌కు ఆటంకం కలిగించిన చాహల్‌పై ఇటీవలే కోహ్లి, రోహిత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు. అయినా చాహల్ తన తీరును మార్చుకోవడం లేదు. తాజాగా విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సహచరుడితో చేస్తున్న చాట్ మధ్యలో చాహల్ దూరాడు. దీంతో చాహల్‌కు గేల్ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఇటువంటి చర్యలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

chris gayle warning to yuzvendra chahal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News