Thursday, May 2, 2024

రెండు వర్గాల మధ్య ఘర్షణ… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

అకోలా (మహారాష్ట్ర): అకోలా నగరంలో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన మతపరమైన అంశం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో ఒకరు ప్రాణాలు కోల్పోవగా, ఇద్దరు పోలీస్‌లతోసహా మొత్తం ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణకు సంబంధించి 26 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. ఉద్రిక్త ప్రాంతమైన పాత సిటీలో శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. శాంతి భద్రతల కోసం నాలుగు పోలీస్ స్టేషన్ల ఏరియాలో 144 సెక్షన్ విధించారు.

సోషల్ మీడియాలో మతపరమైన పోస్ట్ వైరల్ అయిన తరువాత రెండు వర్గాలు రాళ్లు విసురుకున్నాయని, కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయని ఎస్‌పి సందీప్ ఘుగే చెప్పారు. ఒకరు చనిపోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు. అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి పోలీస్‌లు భాష్పవాయువును ప్రయోగించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని ఎస్‌పి చెప్పారు. అకోలా పర్యవేక్షకులైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘర్షణ తరువాత భారీ బందోబస్తు చేశారు. దాదాపు వెయ్యిమంది రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలను అకోలా సగరంలో నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News