Sunday, April 28, 2024

పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రతే పల్లె ప్రగతి లక్ష్యం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Palle Pragathi Program

 

హైదరాబాద్: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్నామని, పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. పల్లె ప్రగతి పురోగతిపై ప్రగతిభవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో కెసిఆర్ మాట్లాడారు. ప్రతి రోజు గ్రామంలో పారిశుద్ధ్య పనులు జరగాలన్నారు. పల్లె ప్రగతి తీరుపై త్వరలోనే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమం కాకుండా చిత్త శుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనులు చేయించాలన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుందన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉన ఖాళీలన్న భర్తీ చేశామని, ప్రతీ గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించామని, పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచామని, ప్రతీ నెల క్రమం తప్పకుండా రూ.339 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామానికి ట్రాక్టర్ సమకూరుస్తామన్నారు. ప్రభుత్వం ఇన్ని రకాల సహకారం, ప్రేరణ అందిస్తున్నందున పల్లెలు బాగుపడాలని తమ వంతు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రతీ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేశామన్నారు.

 

Sanitation works are done in the village every day. It is stated that they will be making sudden trips to the villages soon on the progress of the village. Representatives and officials should be doing greenery and hygiene work in the countryside with goodwill and cleanliness.

 

Clean – Grean in Villages in Palle Pragathi Program
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News