Saturday, April 27, 2024

ది (టి) బెస్ట్

- Advertisement -
- Advertisement -

Telangana top in Sansad Adarsh Gram Yojana

దేశంలోని టాప్ 10 గ్రామాల్లో 7 తెలంగాణవే

పల్లె ప్రగతి, మిషన్ భగీరథలో సకల సౌకర్యాలతో అలరారుతున్న పల్లెలు
సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న రాష్ట్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. జాతీయ స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతున్న టాప్ పది గ్రామాల్లో ఏడు గ్రామాలు మన రాష్ట్రం నుంచే ఉండడం విశేషం. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం (ఎస్‌ఎజివై)లో రాష్ట్రం దూసుకపోయింది. మొదటి స్థానంతో పాటు పలు స్థానాలను దక్కించుకుని జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మరోసారి తన ప్రత్యేకతను దక్కించుకుంది. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం పంచాయతీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని గ్రామాల సమగ్ర గ్రామాభివృద్ధిని పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రతి సంవత్సరం ఈ ర్యాంకులను వెల్లిడిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మన రాష్ట్రం మొదటి స్థానంతో పాటు 2,4,5,6,9,10 స్థానాలను దక్కించుకుంది. ఇవన్నీ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని గ్రామాలకు దక్కాయి. వాటిల్లో కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, వెన్నంపల్లి గ్రామానికి మొదటి స్థానం లభించింది.

నిజామాబాద్ జిల్లా జూక్కల మండలం కొలాస్ గ్రామానికి రెండవ స్థానం దక్కింది. అలాగే కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గన్నేరువరం గ్రామానికి నాలుగవ స్థానం, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామానికి ఐదవ స్థానం, కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వీర్కపల్లి గ్రామానికి ఆరవ స్థానం, వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామానికి తొమ్మిదవ స్థానం, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలం తానాకూర్డు గ్రామానికి 10వ స్థానం దక్కింది. ఈ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఆధారంగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ప్రధానంగా ఆయా గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు కల్పిస్తున్న తాగునీటి సౌకర్యం, సరైన రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధం, వైకుంఠదామాలు, మరుగుదొడ్ల నిర్మాణం, గ్రీనరీ తదితర అంశాల ఆదారంగా అభివృద్ధిని లెక్కించి కేంద్రం ర్యాంకులను ప్రకటిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోని పలెల్లు పచ్చని హారాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం సంవత్సరంలో ఏడు ర్యాంకులను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం….వచ్చే సంవత్సరం పదికి పది ర్యాంకులను సాధించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని తెలుస్తోంది

అభినందనీయం…మంత్రి ఎర్రబెల్లి
పల్లె ప్రగతిలో పల్లవిస్తున్న రాష్ట్ర గ్రామాలు జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంలోన గ్రామాలు 1,2,4,5,6,9,10 ర్యాంకులు సాధించడం అరుదైన ఘనతగా ఆయన అభివర్ణించారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ…. ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో వరసగా అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ….. ఎన్‌ఎజివై పథకంలోనూ టాప్ పది గ్రామాలకు గానూ ఏడు గ్రామాలను మన రాష్ట్రమే దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

రాష్ట్రంలోని పల్లెలకు జాతీయస్థాయిలో అత్యుత్తమ గుర్తింపు రావడానికి పల్లె ప్రగతి ప్రధాన కారణమన్నారు. మిషన్ భగీరథ ద్వారా 100 శాతం సిఎం కెసిఆర్ దిశానిర్దేశంలో గ్రామాలకు నల్లా ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన వైకుంఠ ధామాలు, మొక్కల పెంపకం, నర్సరీలు, అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, ఇంటి నుండి చెత్త సేకరణ పల్లె ప్రకృతి వనాలు ఇలాంటి కార్యక్రమం సమర్థవంతంగా అమలు కావడం, ప్రతినెల గ్రామీణ స్థానిక సంస్థల నిధుల విడుదల నేపథ్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఒకప్పుడు వరంగల్ జిల్లాలోని గంగాదేవిపల్లె దేశానికి ఆదర్శంగా నిలిచిందని దేశ విదేశాల నుండి సందర్శకులు వచ్చి ఆ గ్రామాన్ని చూసి పోయే వారని ఆయన అన్నారు. సిఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల ఇప్పుడు ప్రతి పల్లె ఒక గంగదేవిపల్లెగా మారుతుందన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం అమలులో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని సమగ్ర అభివృద్ధి చేసి అవార్డులు రావడానికి కృషిచేసిన ఎంపిలు చేసిన కృషికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అవార్డులు రావడానికి గ్రామస్థాయిలో నిరంతరం కృషి చేసిన గ్రామ సర్పంచ్ లకు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు, ఉద్యోగులకు మంత్రి అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News