Saturday, April 27, 2024

రాష్ట్రం సిగలో మరో నగ

- Advertisement -
- Advertisement -

Medha Railway Coach Factory to be started in private sector soon

త్వరలో ప్రైవేట్ రంగంలో ప్రారంభం కాబోతున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

ఫౌండర్ ఎడవల్లి యుగేందర్‌రెడ్డికి ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు
రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో భూమి పూజ జరిగిన ఫ్యాక్టరీ
నిర్మాణం వేగంగా పూర్తి చేసుకున్న కోచ్ కర్మాగారం
రూ.500కోట్ల పెట్టుబడి, 2వేల మందికి ఉపాధి అవకాశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో భారీ సంస్థ ప్రారంభం కాబోతోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఫౌండర్ ఎడవల్లి యుగేందర్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టర్లీలో ఒకటైన మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభం కానుండడం గర్వకారణంగా ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన ఫోటోలను పొందుపర్చారు. రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కొడంకల్‌లో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు. భూమిపూజ చేసిన దగ్గరి నుంచి నిర్మాణ పనులను మేధా సంస్థ వేగంగా పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కాబోతోంది. సమారు 500 కోట్ల రూపాయలతో మేధా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రైల్ కోచ్‌లు, మెట్రో కోచ్‌లుఇక్కడ తయారు చేయనున్నారు. 1984లో మేధా సంస్థ ఆవిర్భవించింది. గడిచిన 15 ఏళ్ల పాటు ఇండియన్ రైల్వే ఆమోదం, గుర్తింపు పొందేందుకు చాలా కృషి చేసినట్లు మేధా సంస్థ యాజమాన్యం పేర్కొంది. 2005లో సుమారు రూ.25 కోట్ల టర్నోవర్‌తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గడిచిన 17 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో నాలుగైదు ఖండాల్లో మేథా సంస్థ విస్తరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News