Friday, May 3, 2024

వెయ్యి డ్రోన్లతో వెలుగుల హరివిల్లు

- Advertisement -
- Advertisement -

Closing Celebrations of the Republic Day of India

 

న్యూఢిల్లీ : భారత గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు దేశ రాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంజయ్ చౌక్ వద్ద సైనిక పారామిలిటరీ దళాలు నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం అలరించింది. సైనికులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఏటా జరిగే ఈ బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో ఈసారి పూర్తి స్వదేశీ డ్రోన్‌లతో లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే తొలిసారి 1000 డ్రోన్లతో లేజర్‌షో నిర్వహించారు. ఆకాశం లోకి రివ్వున ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్ వెలుగులను విరజిమ్ముతూ ప్రత్యే ఆకృతుల్లో కనువిందు చేశాయి. త్రివర్ణ కాంతులతో అబ్బురపరిచాయి. బీటింగ్ రీట్రీట్ సందర్భంగా రాష్ట్రపతి భవన్ మువ్వన్నెల కాంతుల్లో ధగధగలాడింది.

ఐఐటి ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్స్ డైనమిక్ అనే అంకుర సంస్థ ఈ డ్రోన్ల షోను రూపొందించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రదర్శన నిర్వహించగా, ఈ చారిత్రక ప్రదర్శనతో భారత్ కూడా ఆ జాబితాలో చేరింది.న ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింగ్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తోపాటు సైనిక దళాల అధిపతులు తదితర ప్రముఖులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News