Saturday, April 27, 2024

జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు…

- Advertisement -
- Advertisement -

Pakka commercial first single release on feb 2

 

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఈ సినిమాలో ఉంది. ఫిబ్రవరి 2న పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఆయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెలని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక, చావు గురించి అద్భుతమైన సాహిత్యం ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News