Friday, May 10, 2024

చత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో సంక్షోభం : రాహుల్‌తో సిఎం, ఆరోగ్యమంత్రి భేటీ

- Advertisement -
- Advertisement -

CM Baghel and health minister to meet Rahul Gandhi

న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో అధికార పగ్గాల కోసం కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న సంక్షోభం తారాస్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి భూపేష్ బగేల్, ఆరోగ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్‌లు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌తో మంగళవారం భేటీ అయ్యారు. రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి చత్తీస్‌గఢ్ ఎఐసిసి ఇన్‌ఛార్జి పిఎల్ పునియా, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కూడా హాజరయ్యారు. సిఎం, ఆరోగ్యమంత్రి వేర్వేరుగా రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు మూడు గంటల పాటు సాగింది. వీరిద్దరి వాదనలు రాహుల్ గాంధీ ఓపికగా విని వారి మధ్య విభేదాలను నివారించడానికి ప్రయత్నించారు. ఇలాంటి సమావేశాలు మరికొన్ని రానున్న రోజుల్లో జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. చత్తీస్‌గఢ్ అభివృద్ధిపైనే సమావేశంలో చర్చించడమైందని పునియా తరువాత పాత్రికేయులకు వెల్లడించారు.

చత్తీస్‌గఢ్ నాయకత్వ సంక్షోభం గురించి చర్చించారనడాన్ని తోసి పుచ్పారు. 2018 డిసెంబర్‌లో చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భూపేష్ బగేల్‌తోపాటు టిఎస్ సింగ్ దేవ్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అయితే అధిష్ఠానం మాత్రం భూపేష్‌కు అవకాశం ఇచ్చింది. రెండున్నరేళ్ల తరువాత రొటేషన్ పద్ధతిలో ముఖ్యమంత్రి మార్పు జరగాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై టిఎస్ సింగ్‌దేవ్ ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత జూన్ నెలతో సిఎం భూపేష్ బగేల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాహుల్ గాంధీతో భేటీ కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని వీరు చెప్పారు. బగేల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కూడా కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News