Sunday, April 28, 2024

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని స్థా నిక సిఎం క్యాంప్ కార్యాలయంలో వర్గల్ మండలం శాఖారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎఫ్‌ఢిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి నుంచి పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. సిఎం కెసిఆర్ దళితులను ఆర్ధికంగా బలోపేతం చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దళితులను పట్టాఇంచుకున్న పాపాన పోలేదన్నారు.

దళిత బంధు పథకానికి ఆకర్షితులై సిఎం కెసిఆర్ చేసిన కృషికి దన్యవాదాలు తెలుపుతూ పెద్దఎత్తున దళితులందరూ బి ఆర్‌ఎస్‌లో చేరుతున్నాని తెలిపారు. దళిత బందు పథకం నిరంత ప్రక్రియ అని విడతల వారిగా ప్రతి ఒక్కరికి రూ. 10 లక్షల చోప్పున దళిత బందు వ స్తుందన్నారు. కాంగ్రెస్, బిజెపిల నుంచి నీరుడు యాదగిరి, పంగ శ్రీను, పంగ హరికృష్ణ, స్వామి, గర్గుల కనకరాజు, పంగ నవీన్, పంగ బాబు, పంగ వెంకటేశ్, పంగ ప్రశాంత్, చంద్రయ్య, యాదగిరి తదితరులు సుమారు 100 మందిపైగా బిఆర్‌ఎస్‌లో చేరారు. వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు వేలూరు వెంకట్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వర్గల్ పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి, శాఖారం సర్పంచ్ ప్రభాకర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News