Tuesday, April 30, 2024

మార్పు తథ్యం

- Advertisement -
- Advertisement -

దేశాన్ని అమెరికా కంటే బలమైన ఆర్థికశక్తిగా చేయొచ్చు
 పాలకులకు గట్టి సంకల్పం ఉండాలి 
మన కేంద్ర పాలకుల్లో ఇది లోపించింది
 స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్నా అనేక రాష్ట్రాల్లో మౌలిక సౌకర్యాలు లేవు
 తెలంగాణ అనేక అంశాల్లో అద్భుత ప్రగతిని సాధిస్తోంది 
ఒకప్పుడు భారత్ కంటే తక్కువ జిడిపి ఉన్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోంది
బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలుసుకున్న తర్వాత మీడియాతో సిఎం కెసిఆర్ దేశాన్ని రక్షించుకోవాలన్నదే కెసిఆర్
తపన : కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి ప్రగతి భవన్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో మార్పు తథ్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ ఆపలేరన్నారు. ఇందుకు సంబంధిం చి రెండు, మూడు నెలల తర్వాత సంచలన వార్త చెబుతానని ఆయన అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. బెంగళూరు పర్యటనలో భాగం గా గురువారం జెడి (ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక మాజీ సిఎం కుమా రస్వామితో సిఎం కెసిఆర్ భేటీ అ య్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దే శంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో సంభాషించినట్లుగా సమాచారం. ఈ సమావేశం ముగిసిన తర్వాత కుమారస్వామితో కలిసి సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. కంటే బలమైన ఆర్థికశక్తిగా భారత దేశాన్ని తీర్చిదిద్దే అవకాశముందని సిఎం కెసిఆర్ అన్నారు. దీనికి పాలకులకు బలమైన సంకల్పం ఉండాలన్నా రు. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర పాలకులకు అది లోపించిందని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో మంచినీరు, విద్యుత్, సాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిది సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక అం శాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే.. భారత దేశం అ లా ఎందుకు పురోభివృద్ధి దిశగా వెళ్లలేకపోతున్నదని సిఎం కెసిఆర్ నిలదీశారు. కనీసం చిన్న, చిన్న దేశాలతో కూడా పోటీపడలేకపోతున్న దుస్థితిలో భారత దేశం ఎందు కు ఉం టున్నదన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూపా యి విలువ పడిపోయిందన్నారు. అలాజే జిడిపిలో భారత్‌ను చై నా అధిగమించిందన్నారు. ఒకప్పుడు భారత్ కంటే తక్కువ జిడిపి ఉన్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని ఎలా శాసించగలగుతోందన్నారు. దీనిపై మోడీ ప్రభుత్వం మా త్రం 5 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అంటూ ప్రచారం చేస్తోందని, ఇది దేశానికే అవమానమని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ దిక్కుమాలిన పరిస్థితి దేశానికి ఎందుకు దాపురించిందో చెప్పే ధైర్యం కేంద్రంలోని మోడీ సర్కార్‌కు ఉందా? అని కెసిఆర్ నిలదీశారు.. అందుకే దేశంలో గుణాత్మక మార్పు రావాలని తనతో సహా చాలా మంది కోరుకుంటున్నారన్నారు.

ఈ మార్పు కోసం ఎవరో వస్తారని ఎదురుచూడాల్సిన పనిలేదన్నారు. ఉజ్వల భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. గతంలో కర్ణాటకకు వచ్చినప్పుడు తాను చెప్పిన మాట నిజమైందని కెసిఆర్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్ణాటకకు వచ్చిన సమయంలో కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వస్తానని చెప్పి వెళ్లానని…. అది అక్షరాల నిజమైందన్నారు. ఇప్పుడు కూడా జాతీయస్థాయిలో పెనుమార్పు రాబోతోందని దాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయన్నారు.ఆ పార్టీల పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. మహిళ లు, యువతతో సహా ఎవరీలోనూ ఆనందం లేదని సిఎం కె సిఆర్ వ్యాఖ్యానించారు. ఎందరో ప్రధానులు రాజ్యాన్ని ఏలి నా …దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదని అన్నారు. ప్రస్తుతం మోడీ హయంలో కూడా దేశంలోని ఏ వర్గం కూ డా సంతోషంగా లేరన్నారు. రోజురోజుకీ పరిస్థితి మరింత దిగజారిపోతోందన్నారు. దేశంలో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయని…. అయినప్పటికీ దేశం అచేతనంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ వెంట బెంగళూరుకు వెళ్లిన వారిలో ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, శాసనసభ్యులు రాజేందర్‌రెడ్డి, జాజుల సురేందర్, కృష్ణమోహన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా బెంగళూరు పర్యటనలో సిఎం కెసిఆర్ ఫ్లెక్సీలు పెద్దఎత్తున కనిపించాయి.
దేశాన్ని రక్షించుకోవాలన్నదే కెసిఆర్ తపన
దేశాన్ని రక్షించుకోవాలన్న తపనతో తెలంగాణ ముఖ్యమం త్రి కెసిఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారని కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కార్‌కు ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మార్పు అవసరమన్నారు. పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కెసిఆర్ కాంక్షిస్తున్నారన్నారు. అందుకు తాము సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

CM KCR Meet Deve Gowda in Karnataka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News