Sunday, April 28, 2024

భారత్ సత్తా చాటాం

- Advertisement -
- Advertisement -

విపత్కర పరిస్థితుల్లోనూ భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది 
యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు 
ఐఎస్‌బి విద్యార్థులు దేశానికి గర్వకారణం 
2001లో వాజ్‌పేయ్ ప్రారంభించిన ఐఎస్‌బి ఇప్పుడు ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఎదిగింది
ఎంతోమంది కృషివల్లే ఐఎస్‌బి ఈస్థాయికి చేరింది పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకే పరిమితం కావొద్దు 
రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత : ఐఎస్‌బి వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమ
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విపత్తు వేళ భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధిలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోందని అన్నా రు. గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దేశంలో వాణి జ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయని తెలిపారు. ఈ ఘనతలన్నీ ప్రభుత్వం ప్రయత్నాల వల్ల మాత్రమే సాధ్యం కా లేదని, భారత్ సాధించిన ఘనతలో ఐఎస్‌బీ విద్యార్థులు, యువకుల పాత్ర ఉందని పేర్కొన్నారు. స్టార్టప్‌లు, సేవా రంగంలో యువత సత్తా చాటుతున్నారని అన్నారు. యువత దేశాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు. భారత ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, పలు సమస్యలకు పరిష్కార మార్గాలు భా రత్‌లో లభిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు ఇండి యా అంటేనే బిజినెస్ అని, యువత ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందన్నారు. రం గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొని ప్ర సంగించారు. ఈ సందర్భంగా ఐఎస్‌బి 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఎస్‌బి స్కాలర్లకు ఎక్సలెన్స్, లీడర్‌షిప్ అవార్డులు ప్రదానం చేశారు. ఐఎస్‌బి స్కాలర్లు అభిజిత్, భరద్వాజ్, వైదేహీ, విక్రమ్ సింగ్, ఉత్కర్ష్, ప్రదీప్లు ప్రధాని చేతుల మీదుగా బం గారు పతకాలు అందుకున్నారు. రాఘవ్ చోప్రాకు – హైదరాబాద్ క్యాంపస్ చైర్‌పర్సన్ అవార్డును మోదీ అందజేవారు. కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఐఎస్‌బి హైదరాబాద్ మరో మైలురాయి అందుకుందని వెల్లడించారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది విద్యార్థులు బయటకు వెళ్లారని.. ఇక్కడి విద్యార్థులు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఐఎస్‌బీ విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అనేక స్టార్టప్‌లు రూపొందించారని ప్రశంసించారు. 2001లో వాజ్‌పేయ్ ప్రారంభించిన ఐఎస్‌బీ ఇప్పుడు ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్‌గా ఎదిగిందని అన్నారు. ఎంతోమంది కృషి వల్లే ఐఎస్‌బీ ఈ స్థాయికి చేరిందన్నారు. 25 ఏళ్ల నాటి సంకల్పంలో చాలా మంది పాత్ర ఉందని పేర్కొన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని ప్రశంసలు కురిపించారు.
అభివృద్ధిలో భారత్ పురోభివృద్ధి సాధిస్తోంది
జీ 20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కన్జూమర్ మార్కెట్ అని పేర్కొన్నారు. స్మార్‌ఫోన్ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ఇంటర్నెట్ వినియోగదారుల జాబితాలో భారత్ రెండోస్థానంలో ఉం దని, స్టార్టప్స్ రూపకల్పన, వినియోగదారులు మార్కెట్‌లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోందని చెప్పారు.
విధానాలు కాగితాలకే పరిమితం కావొద్దు
యువత దేశాన్ని ఏలే విధంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. రిఫార్మ్ .. పర్ఫార్మ్ .. ట్రాన్స్‌ఫార్మ్ .. అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. నాకు మీ మీద నమ్మకం ఉందని… మీకు మీపై నమ్మకం ఉందా…అని విద్యార్థులను అడిగారు. మన విధానాలు, నిర్ణయాలను ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితులు వచ్చాయని చెప్పారు. విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో జోడించాలని పిలుపునిచ్చారు. మీరు చేపట్టబోయే కార్యక్రమాలు దేశానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారని, పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావొద్దని చెప్పారు. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందని తెలిపారు.
8 ఏళ్లుగా నిరాటకంగా సంస్కరణలు
దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలతో సంస్కరణల అమలు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం దేశ యువతకు అండగా నిలబడుతోందని స్పష్టం చేశారు. రాజకీయ అస్థిరత వల్ల మూడు దశాబ్ధాలుగా దేశం పాలసీ నిర్ణయాలు తీసుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 తర్వాత భారత్‌లో సంస్కరణలు వేగవంతం అయ్యాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 8 ఏళ్లుగా నిరాటకంగా సంస్కరణలు చేపడుతున్నామని అన్నారు. దేశంలో 8 ఏళ్లుగా మెడికల్ కాలేజీల సంఖ్య పెంచుకున్నామని తెలిపారు. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని చెప్పా రు. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. యువత కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ను కూడా దేశీయంగా అభివృద్ధి చేసుకున్నామని, భారత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. కరోనా సమయంలో పీపీఈ కిట్ తయారీ కంపెనీలు దేశంలో లేవని, ఇప్పుడు పీపీఈ కిట్లు తయారు చేసే కంపెనీలు 1,100 ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

PM Modi Speech at ISB in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News