Saturday, April 27, 2024

ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR

 

హైదరాబాద్: లాక్‌డౌన్‌ ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. తాజాగా సిఎం కసిఆర్ కరోనాపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. లాక్ డౌన్ అమలు చేయకపోయుంటే మరిన్ని ఎక్కువ కేసులు నమోదు అయ్యేవన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి మందులేదన్నారు. వైద్యులు, పోలీసులకు ప్రజలు సహకరించాలని, మరిన్ని రోజులు స్వియ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాక్ డౌన్ ను వచ్చే నెల 15వ తేదీ వరకు పొడిగిస్తున్నామన్నారు. దయచేసి ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని, రాష్ట్రంలో ఉన్నవాళ్లందరికి ఆహార వసతి ఏర్పాటు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులకు ఆందోళన అవసరం లేదని, హాస్టల్స్‌ ఎట్టి రిస్థితుల్లోనూ మూసివేయబడవని, హస్టల్స్ లో ఉన్న ఎపి విద్యార్థులకు ఆహార వసతి ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్న వారందరి ఆకలి తీర్చుతామని, అన్నదాతలను ఆదుకుంటామని, 15 రోజులు 24 గంటలు కరెంట్‌ అందిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Press Meet on Corona at Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News