Wednesday, May 1, 2024

ఆరు ఫైళ్లపై సిఎం కెసిఆర్ సంతకం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. సచివాలయంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అనంతరం రిబ్బన్‌ కటింగ్‌ చేసి సీఎం కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతకుమారి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ఎలక్ట్రిక్ వాహనంలో ఛాంబర్‌లోకి ప్రవేశించి, సరిగ్గా మధ్యాహ్నం 1:31 గంటలకు తన సీటులో కూర్చున్నారు. ఈ శుభసందర్భంగా మొదటి సంతకం చేయడంతో మొత్తం ఆరు ఫైళ్లపై ఆయన సంతకం చేశారు. వేదపండితులు కూడా హాజరై సీఎం కేసీఆర్‌కు ఆశీస్సులు అందించారు. వేడుకల అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పాదాలను తాకి గౌరవ సూచకంగా కూడా వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News