Friday, May 3, 2024

ఎక్కువగా వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: అడవులను పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తుమ్మలూరులో హరితోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తుమ్మలూరు అర్భన్ ఫారెస్ట్‌లో సిఎం కెసిఆర్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహార విజయం మన అందరి విజయమన్నారు. పచ్చదనాన్ని మరింత పెంచాలని సర్పంచ్‌లను కోరుతున్నామని, గ్రామాలను పచ్చగా చేసిన ఘనత సర్పంచులకే దక్కుతుందని ప్రశంసించారు.

Also Read: 33 శాతం గ్రీన్ కవర్ చేయాలి: కెటిఆర్

పర్యావరణం బాగుంటేనే మన జీవితాలు బాగుపడుతాయని వివరించారు. చైనాలోని గోబీ ఎడారిలో 500 కోట్ల మొక్కలు, బ్రెజిల్‌లో 300 కోట్ల మొక్కలు నాటారని గుర్తు చేశారు. హరితహారంతో అద్భుతాలు జరుగుతాయని, తెలంగాణ అంతటా పచ్చబడిందని కొనియాడారు. హరితహారాన్ని ఉద్యమంలా తీసుకరావడంతోనే తెలంగాణ పచ్చబడిందని మెచ్చుకున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటికే 276 కోట్ల మొక్కలు నాటామని కెసిఆర్ గుర్తు చేశారు.

దేశంలో ఎక్కువగా వడ్లు పండించే రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణలో 7.7 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు. దారులన్నీ పూలదారులుగా మారాయని ఒక కవి రాశారని గుర్తు చేశారు. హరితహారాన్ని చాలా మంది హాస్యాస్పదంం చేశారని, హరితహారంపై కాంగ్రెస్ నేతలు జోకులు వేశారని కెసిఆర్ మండిపడ్డారు. మనకు వ్యవసాయం రాదన్న వారు ఏడో స్థానానికి పడిపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయంలో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో ఉందని కెసిఆర్ ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News