Tuesday, May 7, 2024

వాసాలమర్రిలో 76 కుటుంబాలకు దళితబంధు: సిఎం

- Advertisement -
- Advertisement -

వాసాలమర్రి గ్రామస్థులతో సిఎం కెసిఆర్ ముఖాముఖి…

CM KCR speech in Vasalamarri village

హైదరాబాద్: వాసాలమర్రి గ్రామం అనుకున్నంత బాగా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఉరును బాగు చేయాల్సింది ఎంతో ఉందని, ఏడాది కిందనే దళిత బంధు అమలు కావల్సిందన్నారు.  కరోనా వైరస్‌తో  ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయన్నారు. దళితబంధు ఎక్కడో చోట మొదలు కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఆరునూరైనా సరే దళిత బంధు నీరుగారి పోవద్దన్నారు. పట్టుబట్టి దళిత బంధు సాయంతో పైకి వచ్చి నిరూపించాలని దళితులకు పిలుపునిచ్చారు. వాసాలమర్రి పర్యటనలో సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. దళితుల మధ్య ఐక్యమత్యం పెరగాలని, ప్రజలు ఈర్షా ద్వేషాలు మానుకోవాలని, ప్రతి విషయంలో పోలీస్ కేసుల దాకా పోవద్దని, ప్రేమాభిమానంతో ఉండాలన్నారు.

ఎంఎల్‌సి గోరటి వెంకన్న దళితజాతి రత్నమని సిఎం కెసిఆర్ తెలిపారు. గోరటి వెంకన్న సాహిత్యం ప్రజలను ఉర్రూతలూగించిందని కొనియాడారు. బిసిలను నిత్యం ఏదో రకంగా ఆదుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఏ స్కీం పెట్టినా దళితులకు సంపూర్ణంగా అందలేదని మండిపడ్డారు. అనేక కారణాలు సమాహారంగా దళితులు వెనుకబడుతూనే ఉన్నారని తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం చావు దగ్గరికి వెళ్లి వచ్చానని, తెలంగాణ ఏర్పాటు తరువాత ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ వచ్చానని, ఇవాళ కరెంట్ పొమ్మనా పోదని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలవని, పరిశ్రమలకు కరెంట్ కోత ఉండదన్నారు. మంచి నీళ్లకు చాలా గోస ఉండేదని, అది కూడా తీరిందని, సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నామని, కొండపోచమ్మ సాగర్ కాలువ వాసాలమర్రికి వచ్చిందని, వాసాలమర్రిలో రెండు వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, వాసాలమర్రి గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నాను కాబట్టి 76 కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తింపజేస్తున్నామన్నారు. రేపటి నుంచి వాసాలమర్రి దళితుల అకౌంట్లలో పది లక్షల రూపాయలు పడుతాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News