Saturday, April 27, 2024

చిన్నారుల్లో దీర్ఘకాల కొవిడ్ లక్షణాలు తక్కువే

- Advertisement -
- Advertisement -

Chronic Covid symptoms are less common in children

బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం

లండన్ : కరోనా వైరస్ బారిన పడిన చిన్నారుల్లో వైరస్ లక్షణాలు ఎక్కువ కాలం ఉండవని, వాటి ప్రభావం కూడా కాస్త తక్కువేనని బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా వైరస్ బారిన పడిన ఆరు రోజుల్లోనే చిన్నారులు కోలుకుంటున్నట్టు తెలియచేసింది. నాలుగు వారాల కంటే ఎక్కువగా కొవిడ్ లక్షణాలతో బారిన పడే వారి చిన్నారుల సంఖ్య తక్కువేనని వివరించింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ చైల్డ్ అండ్ అడొలిసెంట్ హెల్త్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. చిన్నారుల్లో కరోనా వైరస్ తీవ్రత లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్ లోని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కొవిడ్ బాధితుల పర్యవేక్షణ కోసం రూపొందించిన జెడ్‌ఒఇ కొవిడ్ ద్వారా సెప్టెంబర్ 12020 నుంచి ఫిబ్రవరి 22, 2021 వరకు సేకరించిన కొవిడ్ బాధితుల సమాచారాన్ని పరిగణన లోకి తీసుకున్నారు.

ఇందుకోసం 5 నుంచి 17 ఏళ్ల వయసున్న రెండున్నర లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. వారిలో మొత్తం 1734 మందిలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. అనంతరం జరిపిన నిర్ధారణ పరీక్షల్లోనూ వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్ నుంచి కోలుకునే వరకు వారి ఆరోగ్యాన్ని పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. కొవిడ్ బారిన పడిన చిన్నారుల్లో తలనొప్పి, అలసట, గొంతునొప్పి, వాసన కోల్పోయే లక్షణాలే ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ పరిశోధకులు గుర్తించారు. ఇవి సరాసరిగా ఆరు రోజులు ఉండగా, వైరస్ సోకిన తొలి వారం లోనే లక్షణాల ప్రభావం తగ్గిపోతున్నాయి. వైరస్ బారిన పడిన చిన్నారుల్లో కొఎక్కువ మంది నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటున్నారు. కొందరిలో మాత్రమే లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటున్నాయి. వీరి లోనూ కేవలం జలుబు, ఫ్లూ వంటి రెండు లక్షణాలే ప్రధానంగా దీర్ఘకాలం కనిపించాయని బ్రిటన్ పరిశోధకులు పేర్కొన్నారు. తద్వారా పిల్లల్లో కొవిడ్ ప్రభావం తక్కువ గానే ఉందని, రికవరీ కూడా త్వరగానే ఉన్నట్టు నిపుణులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని, పిల్లలు తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టే ఈ ఫలితాలను అంచనా వేశామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News