Monday, April 29, 2024

వాసాలమర్రిలో పర్యటించిన కెసిఆర్…

- Advertisement -
- Advertisement -

KCR tour in Vasalamarri

హైదరాబాద్: దత్తత గ్రామం వాసాలమర్రిలో సిఎం కెసిఆర్ పర్యటించారు. దళితవాడలో దాదాపు మూడు గంటలకు పైగా పర్యటించారు. సిఎం కెసిఆర్ వాడవాడలా కాలినడకన తిరిగారు. దళిత మహిళలు సిఎం కెసిఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు. దాదాపుగా 60 ఇండ్లలోకి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు లేని వారికి డబుల్‌బెడ్ రూమ్‌లు ఇండ్లు ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు. దళితబంధు పథకం గురించి తెలుసా అని దళితులను అడిగారు. ఇంటికి పది లక్షల రూపాయలు ఇస్తే ఏం చేస్తారని దళిత కుటుంబాలను కెసిఆర్ ప్రశ్నించారు. పది లక్షలతో డెయిరీ ఫామ్ పెట్టుకుంటామని కొందరు తెలిపారు. ట్రాక్టర్లు కొంటామని, వ్యాపారం చేసుకుంటామన్నారు. ఆసరా పెన్షన్‌పై కెసిఆర్ ఆరా తీశారు. పెన్షన్ రాని వారికి వెంటనే మంజూరు చేయాలని కెసిఆర్ ఆదేశించారు. దళిత వాడల్లో కూలిపోయే ఇండ్లను చూసి సిఎం చలించిపోయారు. దళిత బంధు డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. మహిళలు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా రోడ్లు డ్రైనేజీలు ప్లాన్ ప్రకారం ఉండాలని కెసిఆర్ ఆదేశించారు. పెన్షన్ అందడం లేదని చెప్పిన 20 మంది బిడి కార్మికులకు రెండో రోజుల్లో పెన్షన్ అందించాలని కలెక్టర్‌కు సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News