Sunday, May 5, 2024

నగరాభివృద్ధిపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగర అభివృద్ధిపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో వెయ్యి కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులతో శరవేగంగా పరుగులు పెడుతోందని, మౌలిక వసతులకల్పనకు పెద్దపీట వేయడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆదివారం అర్సపల్లిలో ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న వైకుంఠ ధామాన్ని పరిశీలించారు. నిజామాబాద్‌లో హైదరాబాద్ తరహాలో ఆధునాతన వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నామని అన్నారు.

త్వరలో మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. నగరంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు సిఎం కెసిఆర్ కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరుగుతోందని నగరంలో ఇప్పటికే సుందరీకరణ పనులతోపాటు రోడ్లు, పార్కులు ఇతర మౌలికవసతులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇది వరకే 15వ డివిజన్ అర్సపల్లిని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే బిగాల ప్రత్యేక నిధులతో సామాజిక భవనాలు, రోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు. మంచినీటి ట్యాంకులు, ఫీడర్ లైన్లు వేసి ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందిస్తున్నారు.

చివరి మజీలికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వైకుంఠ దామాన్ని నిర్మించడం జరుగుతోందని అందులో స్మశాన వాటిక అనుభూతి కలగకుండా పచ్చని చెట్లతో అందమైన లైట్లతో అధునాతన వసతులతో నిర్మించడం జరుగుతోందని, దీనిని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కెటిఆర్ చేతులమీదుగా ప్రారంభించేందుకు వైకుంఠధామాన్ని తీర్చిదిద్దడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News