Wednesday, May 8, 2024

ప్రధాని మోడీకి సిఎం మమత బెనర్జీ లేఖ..

- Advertisement -
- Advertisement -

CM Mamata Banerjee writes to PM Modi on GST Arrears

కోల్ కతా: కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రాలకు జిఎస్టీ బకాయిలను చెల్లించాలని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. బుధవారం జీఎస్టీ వాటాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సిఎం మమత బెనర్జీ లేఖ రాశారు. గత 6 నెలలుగా కరోనా సంక్షోభంలో ఉన్నామని.. దీంతో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నామని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొత్తగా అప్పులు ఎలా తెచ్చుకోవాలని, చిన్న అభివృద్ధి పనులను కూడా చెయలేకపోతున్నామన్నారు. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సింది పోయి సహాయం నిలిపివేస్తారా.. ఇలా చేస్తే రాష్ట్రాలను అప్పుల ఊబిలోకి నెట్టినట్లేనని మమత అన్నారు. దీనిపై ప్రధాని మోడీ జోక్యం చేసుకొని జిఎస్టీ కౌన్సిల్ పై నమ్మకాన్ని నిలబెట్టాలని, వెంటనే జిఎస్టీ వాటా చెల్లించాలని ఆమె ప్రధాని మోడీని కోరారు.

కాగా, జిఎస్‌టి పరిహారం కోసం రాష్ట్రాలే అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ సిఎం కెసిఆర్ మంగళవారం ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న ప్రతిపాదన ఏమాత్రం సబబు కాదని, కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని సిఎం కెసిఆర్ ప్రధానిని కోరారు.

CM Mamata Banerjee writes to PM Modi on GST Arrears

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News