Sunday, September 15, 2024

న్యూయార్క్‌లో సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగ తం లభించింది. న్యూయార్క్ విమానాశ్రయం చేరుకున్న సిఎం బృందానికి ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు ’జై రేవంతన్న… జైజై రేవంతన్న… రేవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదా లు చేశారు. అభిమానులు, కాంగ్రెస్ ఎన్నారైలు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, ఆయన బృందం విదేశాలలో పర్యటిస్తోంది. ఈ నెల 14న తిరిగి తెలంగాణకు రానున్నారు. 10 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు సీఎం. అక్కడ తెలుగువారు బోకేలతో రేవంత్ కుఘనస్వాగతం పలికారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుందని తెలంగాణ సిఎంఓ ట్వీట్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా, దక్షిణ కొరియాలోని టాప్ కంపెనీలతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారని, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులు తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్షంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ప్రారంభమైందని తెలిపారు. ‘కీలకమైన న్యూయార్క్ నగరం నుంచే పెట్టుబడుల సాధన పర్యటన ప్రారంభించడం సముచితంగా భావిస్తున్నాను. ప్రవాస భారతీయులైన ఇక్కడి మన తెలుగు సోదర సోదరీమణులు గుండెల నిండా ప్రేమ, ఆప్యాయతలతో మాకు స్వాగతం పలకడానికి విచ్చేశారు. మనందరినీ ఏకం చేసే ఒక కల..తెలంగాణను మరింత గొప్పగా అభివృద్ధి చేసుకోవడం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.

న్యూయార్క్ నగరం నుంచి మొదలైన ఈ పెట్టుబడుల సాధన పర్యటనలో రాబోయే పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియా లోని వివిధ నగరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార ప్రముఖులతో సమావేశాలు, చర్చలు జరగనున్నట్లు తెలంగాణ సిఎంఓ ట్వీట్ చేసింది. ముఖ్యమంత్రి నాయకత్వంలోని బృందంలో పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి, పలువురు ఉన్నతాధికారులు భాగమవుతారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News