Monday, May 6, 2024

నీట్‌ను అడ్డుకుందాం

- Advertisement -
- Advertisement -

CM Stalin writes to CM KCR to join hands against NEET

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం
ఎంకె స్టాలిన్ లేఖ
తెలంగాణ, ఎపి సహా 11 రాష్ట్రాల సిఎంలకు లేఖలు
విద్యార్థుల భవిష్యత్తును నీట్ దెబ్బతీస్తుందని వివరించిన స్టాలిన్

మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను అడ్డుకునేందుకు తమిళనా డు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ఇతర రాష్ట్రాల మద్దతు కూడగతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖలు రాశారు. విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాల్సిన అంశాలపై విపులంగా ఆ లేఖలో విశదీకరించినట్లుగా తెలు స్తోంది. ఇందుకు తమిళనాడు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. ఈ నేపథ్యంలో తమ వంతు సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆయా రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఇందులో విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామ ని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. తన లేఖలో ప్రధానంగా నీట్ అంశాన్ని ప్రస్తావించారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం జస్టీస్ ఎకె రాజ న్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చి న నివేదిక కాపీని కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, ఢిల్లీ, జార్ఘండ్, చత్తీస్‌గడ్, మహరాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, గోవా రాష్ట్రాల సిఎంలకు పంపిణి లేఖలో పొందుపరిచారు.

రాజన్ కమిటీ సిఫార సు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమో దం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు. కేంద్రం నీట్‌ను ప్రవేశపెట్టి సమాఖ్యవాదాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించా రు. ఈ విషయాన్ని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామన్నారు. వైద్యవిద్యా వ్యవస్థ నిర్వహణ ను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం తీసుకుని మన హక్కులను హరిస్తోందని తన లేఖలో సిఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవే శాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలన్నారు. నీట్ పరీక్ష నేపథ్యంలో ఇటీవలి కాలంలో పలువురు తమిళనాడు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనల ను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిం ది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతం గా మినహాయించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. దీనికి ఇతర రాష్ట్రా ల మద్దతు కూడగట్టేందుకు స్టాలిన్ సిఎంలకు లేఖలు రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News