Tuesday, April 30, 2024

కీలక నిర్ణయాలు తీసుకున్న ఎపి కేబినెట్

- Advertisement -
- Advertisement -

CM YS Jagan Cabinet Takes Key Decisions

అమరావతి: ఎపి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్ లో చర్చించారు. కేంద్ర సాధనకు కృషి చేస్తునే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఐదు దశల్లో రాయయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టానున్నారు.

మొదటిదశలో రామాయాపట్నం పోర్టుకు రూ.4,736 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సిఎం జగన్ సూచించారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపాలని జగన్ తెలిపారు. ఆగస్టు 12 తేదీన వైఎస్సార్ చేయూత పథకాన్ని సిఎం జగన్ ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ఈ నెల 16 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

CM YS Jagan Cabinet Takes Key Decisions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News