Sunday, April 28, 2024

బెజవాడలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపిలోని బెజవాడ స్వరాజ్య మైదానంలో సిఎం వైఎస్ జగన్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. స్వరాజ్ మైదానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానంగా పేరు మార్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. 201 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడకే ప్రత్యేకతగా నిలవనుంది.

18.81 ఎకరాల్లో దీనిని నిర్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందులో రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. గ్రంధాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్టును కూడా పెట్టారు. మ్యూజియంను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ ఫొటో గ్యాలరీలు, జీవిత విశేషాలను పొందుపర్చారు. బెజవాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిని సందర్శించుకునేలా తీర్చిదిద్దారు. భవిష్యత్‌లో అతి పెద్ద టూరిజం స్పాట్ గా మారనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News