Tuesday, May 21, 2024

ఈ శీతాకాలంలో చలి తీవ్రత అధికం: ఐఎండి డిజి

- Advertisement -
- Advertisement -

Cold intensity is high this Winter:IMD DG

 

న్యూఢిల్లీ : ప్రస్తుతం ఏర్పడిన లా నినా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర బుధవారం తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుందని భావించకూడదని, ఇందుకు భిన్నంగా ఈసారి చలితీవ్రత అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. చలిగాలుల తీవ్రతను ఎదుర్కోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎణ్డిఎంఎ) బుధవారం నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన మాట్లాడారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే చలి వాతావరణాన్ని లా నినాగా, వేడి వాతావరణాన్ని ఎల్ నినోగా పేర్కొంటారు. ఈ రెండు పరిస్థితులు భారతదేశంలో వాతావరణంపై ప్రభావం చూపుతాయి. చలిగాలుల కారణంగా రాజస్థాన్, యుపి, బీహార్ తదితర రాష్ట్రాలలో మరణాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News