Friday, May 10, 2024

శాసన మండలి నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

Indefinite adjournment of the Legislature

 

నాలుగు బిల్లులకు ఆమోదం

మనతెలంగాణ/హైదాబాద్: రాష్ట్ర శాసనమండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులను సభ్యుల అభిప్రాయాల మేరకు చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపిన అనంతరం ససభను గుత్తాసుఖేందర్ రెడ్డి నిరవధికంగా వాయిదా వవేశారు. బుధవారం రాష్ట్ర శాసనమండలి సమావేశాల్లో ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020,తెలంగాణ ల్యాండ్ సవరణ బిల్లు (క్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) 2020 బిల్లులను శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి వవేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమార్పిడి అంశంలో ఇప్పటివరకు అధికారులకున్న విశేషాధికారాలు తగ్గుతాయని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన పాలసీ మేరకు పారదర్శకంగా భూబదలాయింపులు, భూముల మార్పిడి జరుగుతాయన్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగడంతో ఎక్కడ అవినీతి జరిగే అవకాశం ఉండదని ఆయన వివరించారు.

ఈ బిల్లుద్వారా సబ్ రిజిస్టార్లకు 47ఒ కింద సంక్రమించిన విచక్షణఆధికారాలను తొలిస్తున్ననట్లఆయన తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు 2020ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టగా బిజెపి సభ్యుడు రామచందర్ రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి కొన్నిసవరణలు కోరారు. జామీను ఇచ్చిన వారిపై చర్యలు తీసుకునే బదులుగా నేరస్తున్ని పోలీసులకు అప్పగించడంలో జాప్యం చేస్తున్న పోలీసులపై కూడా దృష్టి సారిస్తే బాగుంటుందన్నారు. అయితే ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటుగా న్యాయస్థానానికి జవాబుదారిగా ఉంటున్నారని చెప్పారు. అయితే నేరస్తునికి జామీను ఇచ్చిన వ్యక్తి నేరస్తున్ని అప్పగించడంలో నిర్లక్షం వహించడంతో ఏళ్లతరబడి కేసులు పెడింగ్‌లో ఉంటున్నాయన్నారు.

అయితే ఈ బిల్లుద్వారా జామీను ఇచ్చి నేరస్తులను అప్పగించని వారికి జరినామాలు విధించేందుకు చట్టాన్ని సవరించినట్లు తెలిపారు. ఈ సిఆర్‌పిసి చట్టసవరణతో జామీను ఇచ్చిన వారికి బాధ్యతలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రవేశపెట్టిన జిహెచ్‌ఎంసి సవరణ బిల్లు 2020ను సభ ఆమోదించింది. ఈబిల్లుద్వారా మహిళలకు జిహెఎంసి ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, 10 శాతం గ్రీన్ రిజర్వేషన్ నిధులు కేటాయించే అవకాశం కలుగుతుందని మంత్రి కెటిఆర్ చెప్పారు. అలాగే 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు మార్చే సవరణకూడా ఉందని తెలిపారు. వార్డుల వారిగా నాలుగురకాల కమిటీలను ఏర్పాటుచేసి అభివృద్ధిలో పౌరసమాజాన్ని భాగస్వామ్యం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News