Sunday, April 28, 2024

భారత్‌కు రెండో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

Commonwealth Games: Jeremy Lalrinnunga won gold medal

బర్మింగ్‌హమ్ : కామన్‌వెల్త్ క్రీడల్లో భారతకు పతకాల పంట పండిస్తున్నారు. తొలి రోజే మూడు పతకాలతో దుమ్ము రేపిన భారత క్రీడాకారులు రెండో రోజూ పతకాల పరంపర కొనసాగించారు. వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్‌రినుంగా పురుషుల 67 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని గెలుపొందాడు. ఈ 19 ఏళ్ల కుర్రాడు రికార్డు సృష్టిస్తూ తన ఖాతాలో మరో పతకాన్ని వేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు, రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 300కేజీలుకు పైగా ఎత్తి ఓవరాల్‌గా రికార్డు సృష్టించాడు. ఇక మహిళల 55 కిలోల విభాగంలో 23 ఏళ్ల బింద్యారాణి రజతం కైవసం చేసుకుంది. ఆమె వరుసగా స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో 86, 116 బరువులతో మొత్తంగా 202 బరువులు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో ఐదు పతకాలు వచ్చి చేరాయి.
గాయపడ్డ జెరెమీ
ఇకపోతే జెరెమీ తన చివరి ప్రయత్నంలో 165 కేజీలు ఎత్తే టైంలో కాస్త గాయపడ్డాడు. అయితే పెద్ద గాయమేమీ కాదు. అందువల్ల 165కేజీల లిఫ్టింగ్ పూర్తి చేయలేకపోయాడు. ఇక ఏదేమైతేనేం తానే లీడింగ్ స్కోరర్‌గా ఉండడంతో అతనికి గోల్ వశమైంది. ఇక ఫైనల్ రౌండ్ ముగిశాక జెరెమీ గెలుపు కన్ఫామ్ కావడంతో అతనితో పా టు కోచ్‌లు సంబరాల్లో మునిగితేలారు. భారత జాతీయ గీతం ప్లే అవుతుండగా.. పసిడి పతకాన్ని పోడియం మీద అతను అందుకున్నాడు.
గత ఈవెంట్లోనూ గోల్డ్ మెడల్స్..
మిజోరంలోని ఐజ్వాల్‌కు చెందిన 19ఏళ్ల యువకుడు అయిన జెరెమీ 2018 యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో 62కిలోల ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. గత సంవత్సరం కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 67కిలోల విభాగంలో అతను స్వర్ణం కూడా గెలుచుకున్నాడు. ఇక తాజా కామన్ వెల్త్ గేమ్స్‌లో అతను స్వర్ణం సాధించి.. భారత్‌ను పతకాల లిస్టులో 8వ స్థానం నుంచి 6వ స్థానానికి చేర్చాడు. ఈ ఈవెంట్లో సమోవాకు చెందిన వెటరన్ లిఫ్టర్ వైపావ ఐయోనే 293 కేజీల బరువు ఎత్తి రజతం గెలుపొందగా, నైజీరియాకు చెందిన ఎడిడియాంగ్ ఉమోఫియా 290కేజీలతో కాంస్యం సాధించాడు. జెరెమీ తన రెండో రౌండ్లో 140కేజీల బరువు ఎత్తి తన సమీప ప్రత్యర్థి ఎడిడియోంగ్ జోసెఫ్ ఉమోఫియా కంటే 10కిలోల ఆధిక్యాన్ని కనబరిచాడు.
క్వార్టర్ ఫైనల్‌లో నిఖత్..
ఇక భారత బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్స్‌లోకి అ డుగుపెట్టింది. 50 కేజీల ప్రీ క్వార్టర్స్ విభాగంలో విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో వెల్ష్ బాక్సర్ హెలెన్ జోన్స్‌తో నిఖత్ పోటీపడనుంది.

Commonwealth Games: Jeremy Lalrinnunga won gold medal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News