Saturday, April 27, 2024

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో పిర్యాదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని అమ్మవారిపై ప్రమాణం చేయించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం ప్రజలకు డబ్బు ఆశ చూపించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ కమిషన్ ను కోరారు. ఇటీవల హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా గూడూరులో గౌడ కులస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే.. ఎల్లమ్మ గుడి నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానని, టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని ఎల్లమ్మపై ఒట్టు చేయించారని చెప్పారు. బిసిలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Complaint filed in HRC against Parakala MLA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News