Saturday, April 27, 2024

కెసిఆర్‌పై భద్రాద్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన సభ ఎన్నికలలో భారత చైతన్య యువజన పార్టీ తరుపున పోటీ చేసిన పూనెం ప్రదీప్ కుమార్ భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై ఫిర్యాదు చేశారు. 2016లో భద్రాద్రి రామయ్య దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు, 2022లో కరకట్టలు నిర్మాణం చేపట్టడంతో పాటు ఎత్తైన ప్రదేశంలో ఇండ్లు నిర్మించడానికి రూ.1000 కోట్లు ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. భద్రాచలంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2014లో గిరిజన సదస్సులో ప్రతి పేద గిరిజన కుటుంబానికి మూడు ఎకరాల భూమితో పాటు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రం చేస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేయాలని సిఐ నాగరాజురెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News