Saturday, May 4, 2024

కొత్త ఉద్యోగాలలో 40 శాతం మహిళలకే

- Advertisement -
- Advertisement -

Congress Releases election manifesto in UP

మహిళలకు 50 శాతం రేషన్ షాపుల అప్పగింత
యుపి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం

లక్నో: తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సృష్టించే 20 లక్షల కొత్త ఉద్యోగాలలో 40 శాతం మహిళలకు కేటాయిస్తామని వాగ్దానం చేస్తూ రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం విడుదల చేశారు. శక్తి విధాన్ పేరిట ఆరు అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను ప్రియాంక విడుదల చేస్తూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ షాపులలో 50 శాతం షాపులను మహిళలకు కేటాయిస్తామని కూడా వాగ్దానం చేశారు. స్వాభిమాన్(ఆత్మాభిమానం), స్వావలంబన్(స్వయం సమృద్ధి), శిక్ష(విద్య), సమ్మాన్(గౌరవం), సురక్ష(భద్రత), సెహత్(ఆరోగ్యం) పేరిట ఆరు అంశాలను మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కొత్తగా సృష్టించే 20 లక్షల ఉద్యోగాలలో 40 శాతం మహిళలకు కేటాయించడాన్ని విశదీకరిస్తూ ప్రస్తుత రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ఈ కేటాయింపు జరుపుతామని ప్రియాంక తెలిపారు.

ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర కార్మిక మంత్రిత్వశాఖతోపాటు మరో శాఖను ఏర్పాటు చేస్తామని కూడా ఆమె వాగ్దానం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా మహిళలకు 40 శాతం ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటామని ఆమె వాగ్దానం చేశారు. తమ సంస్థలలో మహిళలకు 50 శాతం ఉపాధి కల్పించే సంస్థలకు పన్ను మినహాయింపులతో పాటు రాయితీలు కల్పిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు విడుదల చేస్తున్నది మొదటి మ్యానిఫెస్టోనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ తెలిపారు. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News