Wednesday, May 1, 2024

గుడ్ల దొంగతనం… హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్… (వీడియో)

- Advertisement -
- Advertisement -

Constable steals eggs from cart on busy road

 

ఛండీగఢ్: నడిరోడ్డుపై ఓ హెడ్ కానిస్టేబుల్ గుడ్లను దొంగతనం చేస్తూ దొరికిపోవడంతో అతడిని సస్పెండ్ చేసిన సంఘటన పంజాబ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఛండీగఢ్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ పోలీస్ స్టేషన్‌లో ఓ ప్రీత్‌పాల్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ పని చేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం రోడ్డుపై విధుల నిర్వహిస్తుండగా అతడికి సమీపంలో కోడి గుడ్లు తీసుకెళ్తున్న రిక్షా కనిపించింది. ఎవరు కంట కనపడకుండా నాలుగు గుడ్లను తన జేబులో హెడ్ కానిస్టేబుల్ వేసుకున్నాడు. వెంటనే మరో రిక్షాలో వెళ్లిపోయాడు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News