Saturday, May 4, 2024

చెనాబ్ నదిపై రైలు వంతెన ఆర్చి నిర్మాణం పూర్తి

- Advertisement -
- Advertisement -

Construction of railway bridge arch over Chenab River is complete

 

కౌరి(జమ్మూ కశ్మీరు): జమ్మూ కశ్మీరులోని చెనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెనకు చెందిన ఆర్చి నిర్మాణం సోమవారం పూర్తయింది. నది ఒడ్డు నుంచి 359 మీటర్ల ఎత్తులో జరుగుతున్న ఈ వంతెన నిర్మాణంలో భాగంగా ఆర్చ్ నిర్మాణం పూర్తి కావడాన్ని భారతీయ రైల్వే రంగంలో గొప్ప మైలురాయిగా భారతీయ రైల్వే అభివర్ణించింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్(యుఎస్‌బిఆర్‌ఎల్) ప్రాజెక్టులో భాగంగా రూ. 1,480 కోట్ల వ్యయంతో ఈ 1.3 కిలోమీటర్ల రైలు వంతెన నిర్మాణం జరుగుతోంది.

కశ్మీరు లోయను దేశంలోని వివిధ ప్రాంతాలతో నేరుగా కలపడమే లక్షంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తవుతుందని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ రీసీ జిల్లాలోని ప్రాజెక్టు స్థలం వద్ద సోమవారం విలేకరులకు తెలిపారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ రైలు వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ వీక్షించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రైల్వే అధికారులతోపాటు కొంకణ్ రైల్వే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News