Friday, May 3, 2024

నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ఉన్నా తీరని నగరవాసుల కష్టాలు

- Advertisement -
- Advertisement -

అధిక ధరతో అనాసక్తి
నేరవేరని ప్రభుత్వ లక్ష్యం

Construction waste recycling plants

మన తెలంగాణ/సిటీబ్యూరో : స్వచ్ఛ హైదరాబాద్ లక్షంగా ప్రభుత్వం నిర్మాణ వ్యర్థాలను సమగ్ర నిర్వహణలో భాగంగా నగరంలో రెండు(సి అండ్ డి) రీసైక్లింగ్ ప్లాంటకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా రూ.15 కోట్ల వ్యయంతో జీడిమెట్లలో ఒక సి అండ్ డి ప్లాంట్‌ను, ఇంచుమించుగా అదే వ్యయంతో ఫత్తుల్లాగూడలో మారో ప్లాంట్‌ను జిహెచ్‌ఎంసి పిపిపి, బిఓటి పద్ధ్దతిలో ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి జీడిమెట్లలో ఎంతో విలువైన 17 ఎకరాల స్థలం టిఎస్‌ఐసిసి కేటాయించగా, ఫత్తుల్లాగూడలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ రెండు ప్లాంట్ల ద్వారా రోజువారిగా 1000 మెట్రిక్ టన్నుల వరకు నిర్మాణ వ్యర్థాల క్రషింగ్ చేసి వాటిని సుమారు 800 మెట్రిక్ టన్నుల వరకు ఇసు క, కంకర తదితరలను పునర్ ఉత్పత్తి సైతం చేస్తున్నారు. ఇది పూర్తిగా నగర స్వచ్ఛతకు సంబంధించిన అంశంతో పాటు పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని కట్టుకోవాలనుకునే నగరవాసులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. అయితే వీటిని నిర్వహిస్తున్న సంస్థ లాభపేక్షకు తోడు జిహెచ్‌ఎంసి అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణం గా ఇటు నగరవాసులకు అటు జిహెచ్‌ఎంసికి గుదిబండగా మారింది. సదరు సంస్థ టన్నుకు రూ.342లను వసూళ్లు చేస్తుండడంతో నగరవాసులకు నిర్మాణ వ్యర్థాల ను తొలగించుకోవడంలో కష్టాలు తప్పడం లేదు. ఈ భా రం మేయలేం అనుకుంటున్న వారు రాత్రికి రాత్రే రోడ్ల పక్కన కుప్పలు పోస్తుండగా, మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులకు తోచిన కాడికి ముట్టజెప్పి వ్యర్థాలను వదలించుకుంటున్నారు. దీంతో నగరంలో చెరువులు, కుంట లు, రోడ్ల పక్కన నిర్మాణ వ్యర్థాలు కనిపించకుడదనుకు న్న ప్రభుత్వ అసలు లక్షం నీరుగారిపోతోంది.
ధర అధికమే కారణం :
గ్రేటర్‌లో పాత ఇంటిని కూల్చి వాటి వ్యర్థాలను రీసైక్లిం గ్ ప్లాంట్లకు పంపించాలంటే నగరంలోని నిరుపేద, మ ధ్యతరగతి వారికి మోయలేని భారంగా మారుతోంది. నిర్మాణ వ్యర్థాలను ప్రైవేట్ వ్యక్తులు టన్నుకు రూ.100 నుంచి రూ.150 తీసుకుని తరలిస్తుండగా సి అండ్ డి ప్లాంట్ వారు మాత్రం టన్నుకు రూ.342లను వసూళ్లు చేస్తున్నారు. దీంతో కేవలం నిర్మాణ వ్యర్థాలను వదిలించుకునేందుకు సగటు నిర్మాణ దారుడికి ఇంటి కూల్చివేసిన వైశ్యాలయం, అంతస్తులను బట్టి రూ. 20 వేల నుం చి 50 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ప్రైవే ట్ వ్యక్తులు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా 10 టన్నుల వరకు రూ1000కి అటు ఇటుగా తీసుకుంటున్నారు. దీంతో గ్రేటర్‌లో సగానికి సగం పైగా నిర్మాణ వ్యర్థాలను ప్రైవే ట్ వ్యక్తులేకు నగరవాసులు అప్పగిస్తున్నారు. మరో 10 శాతం మంది అవకాశం దక్కితే చాలు రోడ్లపై పక్కన పారబోసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే సి అండ్ డి ప్లాంట్ నిర్వహణలో లాభపేక్షను ఆశించికుండా నగర స్వచ్ఛతను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు. ప్రై వేట్ వ్యక్థుల మాదిరిగా నామా మాత్రం ఛార్జీలను వసూ ళ్లు చేయాలని పేద, మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. దీంతో తమకు ఆర్ధిక భారం తగ్గడంతో పాటు నగర పరిశుభ్రతకు పెద్ద పీట వేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బల్దియాకు సైతం భారం :
నిర్మాణ వ్యర్థాల తరలింపుకు సంబంధించి ఇప్పటీకే అప్పుల భారంతో శతమతమవుతున్న జిహెచ్‌ఎంసికి అదనంపు భారంగా మారుతోంది. యుబిలిటి గ్యాప్‌ను నిం పే పేరుతో కోట్లా రూపాయాలను సంస్థకు జిహెచ్‌ఎం సి చెల్లిస్తోంది. అయితే సి అండ్ డి ప్లాంట్‌కు టన్ను నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు సంస్థ్ధ రూ.342లను వసూళ్లు చేస్తోంది. అయితే ప్రస్తుతం అత్యధిక సామర్థ్ధం గల లారీలతో పాటు సంస్థకు చెందిన మరో 50 కాప్యాక్టర్ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ద్వారా 15 మెట్రిక్ టన్నులు, ఇతర భారీ వాహనాల ద్వారా 20 నుంచి 30 మెట్రిక్ టన్నులకు ఒక ట్రిప్పులో తరలిస్తున్నా రు. నగరంలో రెండు ప్లాంట్ ఉన్న నేపథ్యంలో దగ్గరలోని ఏ ప్లాంట్‌కు వెళ్లాలన్న 5 నుంచి 20 కిలో మీటర్ల లోపు దూరం మాత్రమే ఉంటుంది. అయితే ఇందుకు వాహనాల ఇంధనానికి గరిష్టంగా ట్రిఫ్‌కు రూ.500, ఇతర ఖర్చులు మరో రూ.500 అనుకున్నా రూ.1000 లోపే అవుతోంది. సంస్థ మాత్రం రూ. 5వేల నుంచి రూ. 11 వేల వరకు రవాణా ద్వారా ఆదాయాన్ని పొం దుతోంది. ఇలా ప్రతి వాహనం కనీసం రోజుకు 5 ట్రిప్పులకు తగ్గకుండా వ్యర్థాలను తరలిస్తున్నాయి. దీనికి తోడు రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా దాదాపు 80 శాతం మేర ఇసుక, కంకర ఇతర నిర్మాణ వస్తువులతో పుట్‌పా త్, పార్కింగ్ టైయిల్స్, బ్రిక్స్ తదితర వస్తువులను ఉత్ప తి చేయడంతో పాటు కంకర, డస్ట్ తదితరాలను రహదారుల నిర్మాణంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. సదరు సంస్థ ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు పూర్తి స్థాయి మా మార్కెట్‌లో మంచి ధర ఉండడంతో ఆదాయాన్నికి డోకా లేదు. అయినా జిహెచ్‌ఎంసి మాత్రం సదురు సం స్థ ఉత్పత్తి చేస్తున్న వాటికి పూర్తి స్థాయిలో మార్కెటింగ్ లేనందును తక్కువ ధరలకు విక్రయిస్తున్నందున యుబిటిలి గ్యాప్‌ను భర్తీ చేసేందుకు ప్రతి ఏటా కొంత మొత్తా న్ని జిహెచ్‌ఎంసి భరించే విధంగా ఒప్పందం చేసుకున్నా రు. దీంతో 201920 ఆర్థిక సంవత్సరానికి గాను రెండు ప్లాంట్లకు రాయితీ కింద రూ.3 కోట్ల చోప్పున రూ.6 కోట్లను చెల్లించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News