Tuesday, April 30, 2024

ఆ ఆరోపణలన్నీ నిరాధారం..

- Advertisement -
- Advertisement -

Copy allegations on Chiranjeevi's 'Acharya' movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను ఇటీవలే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయగా భారీ స్పందన వచ్చింది. అయితే సరిగ్గా అక్కడి నుంచే ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ చిత్రం కథ కాపీ చేయబడినది అని అనేక రకాల వదంతులు వినిపించాయి. కానీ వీటన్నింటిని ఖండిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ అయినటువంటి మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు వివరణనిచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కథ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ మాత్రమే రాసుకున్నారని… అలాంటిది ఆయన కాపీ కొట్టారని వస్తున్న ఆరోపణలు నిరాధారమని ఖరాఖండీగా చెప్పేశారు. కొరటాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

Copy allegations on Chiranjeevi’s ‘Acharya’ movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News