అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసమైన సంఘటన కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలంలో చోటుచేసుకుంది గ్రామస్తులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేట మండలం బసన్నపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజిరెడ్డికి చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న పంట అడవి పందుల దాడిలో పూర్తిగా పంట నష్టం జరిగిందని వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు ప్రస్తుతం మొక్కజొన్న కంకులు ఏర్పడే దశలో ఉండటంతో మొక్కజొన్న అడవి పందులు తీవ్ర నష్టం చేస్తున్నాయని, పంట వద్ద ఆవాసం ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిసారి ఏదో ఒకచోట ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఆయన వాపోయారు.
అడవి పందుల దాడి నుంచి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు తమ గోస వెళ్లబుచ్చుకున్న పరిష్కారం మాత్రం దొరకడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ పంటలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. రైతులు అడవి పందులను తరిమికొట్టడానికి వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు, అడవి పందుల దాడి వల్ల రైతులు పంట నష్టంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. అడవి పందుల దాడిలో నష్టపోయిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.