Saturday, May 4, 2024

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుంటాల : మండలంలోని అంబకంటి గ్రామానికి చెందిన శీల సునిల్ (45) అనే వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల, ఎస్‌ఐ హన్మండ్లు తెలిపిన వివరాల ప్రకారం … శీల సునిల్‌కు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంట విద్యుత్ ఘాతంతో కాలిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు భారమై కుటుంబ పోషణ చేయలేక మనస్థాపం చెందిన ఆయన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హన్మండ్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News