Thursday, May 2, 2024

ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా

- Advertisement -
- Advertisement -

ఆసుపత్రుల్లో గాలిలోనూ కరోనా.. రెండు మీటర్ల వరకు వ్యాప్తి
రోగుల గదుల్లో ఎసి, ఫ్యాన్లు లేకపోతే వ్యాపించదు
హైదరాబాద్‌లో 3, చండీగఢ్‌లో 3 ఆసుపత్రుల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడి : సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా

Corona can stay in airborne in hospitals: CCMB Director

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గాలిలోనూ వ్యా ప్తి చెందుతుందని సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ) షాకింగ్ న్యూస్‌ను వెల్లడించింది. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల వార్డులలో సుమారు 2 గంటల పాటు ఈ వైరస్ గాలిలో ఉండటమే గాక, 2 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు గుర్తించారు. కానీ అసింప్టమాటిక్ రోగుల ఉండే ప్రదేశాల్లో ఏసి, ఫ్యాన్‌లు లేకపోతే ఆ దూరం(2 మీటర్ల) వ్యాప్తి ఉండదని సిసిఎంబి అధ్యయనం తేల్చింది. అయితే నాన్‌కోవిడ్ వార్డులో మాత్రం ఈ వైరస్ ఆనవాళ్లు కనిపియకపోవడం కాస్త ఊరటను కలిగించే అంశమని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఒక ఆసుపత్రిలో కోవిడ్, నాన్‌కోవిడ్ వార్డులు ఉంటే వాటిని వేర్వేరుగా విభజించి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని సిసిఎంబి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు వార్డులు సమీపంలో ఉండకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లేనియెడల నాన్‌కోవిడ్ వార్డులలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సిసిఎంబి హెచ్చరించింది.
హైదరాబాద్‌లో 3, చంఢీఘడ్‌లోని 3 ఆసుపత్రుల్లో అధ్యయనం…
గాలిలో సార్స్ కోవిడ్ జాతికి చెందిన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా? లేదా? అనే అంశాన్నీ క్షుణ్ణంగా గుర్తించేందుకు ఇటీవల సిసిఎంబి, సిఎస్‌ఐఆర్ సంస్థలు సంయుక్తంగా పరిశోధనను నిర్వహించాయి. దీనిలో భాగంగా కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను ఎంపిక చేసుకొని రీసెర్చ్ ప్రారంభించారు. ఈక్రమంలో హైదరాబాద్‌లో మూడు, ఛంఢీఘర్‌లో మరో 3 ఆసుపత్రులను ఎంపిక చేసుకొని శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. కరోనా వార్డులలోని గాలిని సేకరించి వాటిలో వైరస్ కణాలు ఉన్నాయా? లేదా అని గుర్తించేందుకు ఆర్‌టిపిసిఆర్(రియల్ టైం పాలిమరైజేషన్ రీయల్ టైం రీయాక్షన్) విధానంలో పరిశోధించారు. అయితే కోవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకొని వార్డులలో మాత్రమే కరోనా వైరస్ కణాలు గాలిలో తేలియాడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రభుత్వాలు తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఆసుపత్రుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాల తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక హెల్త్ కేర్ వర్కర్ల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతోనూ కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు.
మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్లతోనే సురక్షితంః డా సంజీవ్ కోస్లా డైరెక్టర్ ఐఎంటెక్
క్షేత్రస్థాయిలో వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక వ్యాక్సిన్ మాత్రమే రక్షణ అని ఐఎంటెక్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ టెక్నాలజీ) డైరెక్టర్ డా సంజీవ్ కోస్లా తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్ వంటి ప్రాథమిక సూత్రాలతోనే వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ప్రజలంతా వాటిని పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గాలిలో వ్యాప్తిపై ఆందోళన అవసరం లేదుః సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా
గాలిలో కరోనా వ్యాప్తి చెందినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ మాస్కుతో పాటు జనసమర్థ ప్రదేశాల్లో, గుంపుల మధ్య తిరగకుండా ఉండటం మేలన్నారు. అంతేగాక నిత్యం ఎప్పటికప్పుడు చేతుల శుభ్రం చేసుకోవడంతోనూ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు. అంతేగాక కేసులను వేగంగా గుర్తించి వారిని ఐసోలేట్ చేయగలిగితే సదరు పేషెంట్ కుటుంబ సభ్యులకూ వైరస్ అంటుకోదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Corona can stay in airborne in hospitals: CCMB Director

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News