Sunday, April 28, 2024

ఒక్కో సెంటర్‌లో 30 మందికి టీకా..!

- Advertisement -
- Advertisement -

 లబ్ధిదారులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలదే
 16న వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలి
 జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ
 టీకా పంపిణీకి ప్రజాప్రతినిధులు, హెల్త్ వర్కర్లు సహకరించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభ రోజు ఒక్కో కేంద్రంలో కేవలం 30 మందికి మాత్రమే టీకా ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈనెల 16న 139 కేంద్రాల్లో 4170 మందికి ఫస్ట్ డే వ్యాక్సిన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అయితే వీరిని గుర్తించడం, సెంటర్లకు తరలించడం, తర్వాత హెల్త్ కండీషన్ మానిటరింగ్ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్‌ఓలదేనని హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీకా డోసులు కూడా రాష్ట్రానికి చేరినందున వ్యాక్సినేషన్ బూత్‌లలో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు టీకా పంపిణీ పర్యవేక్షణకు ప్రతి కేంద్రంలో ఓ స్పెషల్ ఆఫీసర్‌నూ నియమించాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేగాక విఐపీలు, సెలబ్రెటీలు వచ్చే కేంద్రాల్లో ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేయాలని రిజ్వీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేగాక వారు ఏయే కేంద్రాలకు వస్తున్నారనేది కూడా ముందస్తుగానే ఒక జాబితాను తయారు చేయాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. మరోవైపు తొలి వ్యాక్సినేషన్ సందర్బంగా పిఎం మోడీ గాంధీ, నార్సింగ్ పిహెచ్‌సి టీకా కేంద్రాల్లోని సిబ్బందితో నేరుగా మాట్లాడనున్నారు. ఈమేరకు అధికారులు అలెర్ట్‌గా ఉండాలని రిజ్వీ కోరారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత రీయాక్షన్లు వస్తే సదరు వ్యక్తులను వెంటనే ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రత్యేకంగా అంబులెన్స్‌లను సిద్దంగా ఉంచాలని సూచించారు.
టీకా పంపిణీపై రిపోర్టు తయారు చేయనున్న డబ్లూహెచ్‌ఓ
కరోనా నియంత్రణ టీకా పంపిణీపై డబ్లూహెచ్‌ఓ ఓ రిపోర్టు తయారు చేయనుంది. తొలి రోజు జరగనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి డబ్లూహెచ్‌ఓ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డా పుట్ట రాజు ఆధ్వర్యంలో మూడు బృందాలు రాష్ట్రంలో పర్యవేక్షించనున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లోనూ ప్రత్యక్షంగా పరిశీలించి కేంద్రంతో పాటు డబ్లూహెచ్‌ఓకి ఓ రిపోర్టు పంపనున్నట్లు ఓ ఉన్నతాధికారి మన తెలంగాణకు తెలిపారు. ఈనెల 16వ తేదిన ప్రారంభమయ్యే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి కోరారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ను అందించడానికి హెల్త్ కేర్ వర్కర్లు, ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఆయన మంగళవారం సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరికి లేఖ రాశారు. టీకా పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించి సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా రహితంగా మార్చుదామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

Vaccine will give only 30 people at Corona Centre in TS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News